ఆరునెలల పసికందు ప్రాణం నిలబెట్టిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌

Chiranjeevi Charitable Trust Saves the 6 Months old Baby Life
x

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Chiranjeevi: తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ బారిన పడిన ఆరునెలల చిన్నారి

Chiranjeevi: చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌.. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. ఆక్సిజన్‌ కోసం తల్లఢిల్లే ప్రాణాలకు ప్రాణవాయివు అందిస్తోంది. ఒకే ఒక ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు చిరు సైన్యం ఆక్సిజన్‌ సిలెండర్‌ పట్టుకొని వాలిపోతోంది. ఇలా ఎందరో ప్రాణాలను కాపాడుతున్న చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్.. తూర్పుగోదావరి జిల్లాలోని ఆరునెలల పసికందుకు ఆయువు పోసింది. ఆ తల్లిదండ్రుల కన్నీళ్లను తూడ్చింది.

కరోనా కష్టకాలంలో మెగాస్టార్‌ చిరంజీవి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆక్సిజన్‌ బ్యాంక్‌ నెలకొల్పి ఎన్నో ప్రాణాలను కాపాడారు. మెగా ఫ్యాన్స్ సైతం మేముసైతం అంటూ ఆక్సిజన్‌ బ్యాంకు‌ సేవలను నలుదిశలా అందిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నానికి చెందిన ఓ ఆరు నెలల పసికందును కూడా కాపాడారు.

శ్రీరంపట్నానికి చెందిన సోమా రామకృష్ణ - లక్ష్మి దంపతుల కూతురు రిషితకు కరోనా సోకింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో 14 రోజులపాటు చికిత్స అందించారు. మళ్లీ నెగిటివ్‌ రావడంతో ఇంటికి తీసుకువచ్చారు. కానీ సడన్‌గా పాపకి ఆక్సిజన్‌ లెవల్స్ పడిపోయాయి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. ఆ చిన్నారిని చూసి తల్లిదండ్రులు తల్లఢిల్లిపోయారు. రాజమండ్రిలోని ఆస్పత్రికి తీసుకువెళ్తూనే ఆక్సిజన్‌ కోసం చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌కు ఫోన్ చేశారు. చిన్నారిని తీసుకొని పేరెంట్స్ రాజమండ్రికి చేరుకునేలోపే చిరు సైన్యం ఆక్సిజన్‌ పట్టుకొని వచ్చేసింది. ఇప్పుడు ఆ పాప ఇంట్లోనే ఆక్సిజన్‌ తీసుకుంటూ హాయ్‌గా ఆడుకుంటోంది.

ఇప్పటి వరకు చిన్నారి కోసం రెండు సిలెండర్లను అందించారు. ఇంకా అవసరముంటే సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. అయితే తమ పాప ప్రాణాలను కాపాడిన మెగాస్టార్‌ చిరంజీవికి, చిరు అభిమానులకు చిన్నారి తల్లి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.

ఒక్క చిన్నారికే కాదు ఆక్సిజన్‌ అవసరముందని ఎవరు కబురు పంపిన చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు స్పందిస్తున్నారు. ఇలా ఎందరికో ఆయువు అందించి ప్రాణాలనుకాపాడుతున్నారు.

తన నటనతో ఇండస్ట్రీలో నెంబర్‌ వన్‌ అనిపించుకున్న చిరంజీవి మానవత్వం చూపించడంలోనూ అగ్రస్థానాన్ని దక్కించుకుంటున్నారు. అందరి మన్నలను అందుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories