Chiranjeevi Charitable Trust: చిన్నారిని కాపాడిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్

Chiranjeevi Charitable Trust Save a Childs Life
x

Chiranjeevi Charitable Trust: చిన్నారిని కాపాడిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్



Highlights

Chiranjeevi Charitable Trust: చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌.. ఓ చిన్నారి జీవితంలో వెలుగులు నింపింది.

Chiranjeevi Charitable Trust: చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌.. ఓ చిన్నారి జీవితంలో వెలుగులు నింపింది. ముక్కపచ్చలరాని ఓ ప్రాణాన్ని కాపాడింది. అమ్మ ఒడిలో హాయిగా ఆడుకునే ఓ చిట్టి తల్లికి కరోనా సోకింది. తల్లిదండ్రులు తల్లఢిల్లిపోతున్నారు. ఆక్సిజన్ దొరకడం గగనమైపోయింది. ఏం చేయాలో తోచని పరిస్థితి. అప్పుడే మేమున్నామంటూ ముందుకు వచ్చింది చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌.

చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులకు 6నెలల కుమార్తె ఉంది. ఆ చిన్నారికి కరోనా సోకింది. పాపకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఆక్సిజన్‌ కోసం ఆ పేరెంట్స్ పడరాని పాట్లు పడ్డారు.

చివరకు చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌కు సమాచారం చేరవేశారు. ట్రస్ట్‌ సభ్యులు వెంటనే స్పందించి, చిన్నారికి ఆక్సిజన్, వైద్య సదుపాయాలు కల్పించారు. సమయానికి ఆక్సిజన్‌ అందించడంతో ఆ చిన్నారి హాయిగా ఆడుకుంటూ చిరునవ్వులు చిందిస్తోంది. దీంతో ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తమ బిడ్డ తమకు దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సకాలంలో స్పందించి, చిన్నారి ప్రాణాన్ని కాపాడడంతో చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌కు పైడిపర్రు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కరోనా కష్ట కాలంలో చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతోంది. వ్యాక్సినేషన్‌, ఆక్సిజన్‌ సరఫరా, నిత్యవసర సరుకుల పంపిణీ ఇలా ఎందరికో సాయం చేస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories