Kurnool: ఎయిర్ పోర్టుని ప్రారంభించిన సీఎం జగన్‌

Chief Minister Jagan Starts the Airport In Kurnool
x

సీఎం జగన్ ఎయిర్ పోర్ట్ ప్రారంభం 

Highlights

Kurnool: ప్రజలకు సేవలందించనున్న ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్ * నెల 28 నుంచి పూర్తిగా అందుబాటులోకి

Kurnool: కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది. వెయ్యి ఎకరాల్లో నిర్మించిన ఈ ఎయిర్‌పోర్టును సీఎం జగన్‌ ప్రారంభించారు. సుదీర్ఘకాలంగా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావటంతో.. ఈరోజు కర్నూలు చరిత్రలో నిలిచిపోతుందన్నారు సీఎం జగన్.

బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి కోసం చేసిన స్వాతంత్ర్య పోరాటం కర్నూలు గడ్డ నుంచే ఊపిరిపోసుకుందన్నారు సీఎం జగన్‌. పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అంటూ కొనియాడారు. ఆయనకు నివాళిగా ఓర్వకల్లు విమానాశ్రయానికి.. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్.

ఇక తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు సీఎం జగన్. ఇటీవల జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనమన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం రిబ్బన్‌ కటింగ్‌తోనే సరిపెట్టిన ఎయిర్‌పోర్టును.. తమ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తి చేసిందన్నారు సీఎం జగన్. తమ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే ఎయిర్ పోర్ట్ పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేసిన మంత్రులకు అభినందనలు తెలిపారు సీఎం.

Show Full Article
Print Article
Next Story
More Stories