CM Jagan: తుఫాన్‌ ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Chief Minister Jagan Review on Cyclone Effect
x

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

CM Jagan: అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం * విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో రివ్యూ

CM Jagan: తుఫాన్‌ ప్రభావంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో రివ్యూ చేసిన ము‌ఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి..... నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా తుఫాన్‌ కారణంగా కోవిడ్‌ రోగులకు ఇబ్బందులు రాకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం రాకుండా చూడాలన్న సీఎం జగన్‌.... ఆక్సిజన్ ప్లాంట్లకు నిరంతరం పవర్ సప్లై ఉండాలన్నారు. అలాగే, ఆస్పత్రులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు.

కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు కొరత రాకుండా ముందుగానే సేకరించి తగినంత నిల్వలు పెట్టుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ముఖ్యంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. తుఫాన్ పరిణామాలను ముందుగానే ఊహించి ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని కోవిడ్ పేషంట్లను అవసరమైతే ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అలాగే, తీర ప్రాంత ప్రజల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, సహాయ శిబిరాల్లో నిత్యవసరాలతోపాటు అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories