కోడి కోత రికార్డ్.. ఏపీలో చికెన్ @ 310

కోడి కోత రికార్డ్.. ఏపీలో చికెన్ @ 310
x
Highlights

కరోనా మహమ్మారి దెబ్బకు పడిపోయిన చికెన్ ధరలు ఏపీలో ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. గత మూడు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ వ్యాపారం పూర్తిగా...

కరోనా మహమ్మారి దెబ్బకు పడిపోయిన చికెన్ ధరలు ఏపీలో ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. గత మూడు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ వ్యాపారం పూర్తిగా కుప్పకూలింది. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందన్న పుకార్లతో.. చికెన్ తినేందుకు జనం జంక్కారు. ఈ క్రమంలో చికెన్ రేట్లు భారీగా పడిపోయాయి. సాధారణంగా 180-200 రూపాయిలు ఉండే కిలో చికెన్ ధర కేవలం 35 రూపాయిలు పలికింది. వందకు మూడు కిలోలు ఇచ్చారు. ఎంత తక్కువకు అమ్మినా.. చికెన్ షాపులు మాత్రం వెలవెలబోయాయి. అసలు చికెన్ కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఫాల్ట్రి యజమానులు లబోదిబోమన్నారు. ఆ తర్వాత ప్రజల్లో అపోహలు తొలగడంతో మాంసం వినియోగం పెరిగింది.

ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది. క్రమంగా రేట్లు పెరిగాయి. 15 రోజుల క్రితం కేజీ చికెన్‌ ధర 200 ఉంటే వారం క్రితం అది 250 రూపాయలకు పెరిగింది. ప్రస్తుతం అది కేజీ 310 రూపాయలు అమ్ముతోంది. బ్రాయిలర్‌ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర. ఇప్పటివరకు రాష్ట్రంలో కిలో చికెన్‌ అత్యధిక (రెండేళ్ల కిందట) ధర రూ. 260 పలికింది. ఇదే ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోయింది. కిలో రూ. 310 అనేది దేశంలోకెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories