జగన్‌-చిరు మీటింగ్‌పై ఎందుకింత కాంట్రావర్సీ?

జగన్‌-చిరు మీటింగ్‌పై ఎందుకింత కాంట్రావర్సీ?
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో, మెగాస్టార్‌ చిరంజీవి సమావేశం కాబోతున్నారు. సైరా సినిమాను వీక్షించాల్సిందిగా, జగన్‌ను కోరబోతున్నారు చిరంజీవి,...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో, మెగాస్టార్‌ చిరంజీవి సమావేశం కాబోతున్నారు. సైరా సినిమాను వీక్షించాల్సిందిగా, జగన్‌ను కోరబోతున్నారు చిరంజీవి, ఆయన కుమారుడు రాంచరణ్. చాలా అరుదైన వీరివురి మీటింగ్‌ కోసం, అటు మెగా అభిమానులు, ఇటు వైసీపీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సమావేశం, రాజకీయవర్గాల్లో రచ్చరచ్చ అవుతోంది. పాత ఘటనలను తవ్వితీస్తూ కొందరు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. తాజాగా చెవిరెడ్డి పేరుతో ఓ ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ చర్చనీయాంశమైతే, ఆ పోస్ట్‌కు తనకూ సంబంధంలేదని చెవిరెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అసలు జగన్‌-చిరుల సమావేశాన్ని కొందరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వారి లక్ష్యమేంటి?

జగన్‌-చిరుల భేటికి ముందే రాజకీయవర్గాల్లో రచ్చరచ్చ

రకరకాల పేర్లతో సోషల్‌ మీడియాలో ట్రోల్

స్వాగతిస్తూ కొందరు వ్యతిరేకిస్తూ మరికొందరు

చర్చనీయాంశమైన చెవిరెడ్డి పేరుతో ఫేస్‌బుక్‌ పోస్ట్

ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతాయని కామెంట్

జగన్‌-చిరు మీటింగ్‌పై ఎందుకింత కాంట్రావర్సీ?

ఈ పోస్ట్‌లు పెడుతున్నది వైసీపీ ఫ్యాన్సా?

పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్సా..లేదా వేరేవాళ్లా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో, మెగాస్టార్‌ చిరంజీవి మీటింగ్‌, ముందే, రకరకాల రచ్చకు వేదిక అవుతోంది. పాత జ్నాపకాలను జగన్‌ ఫ్యాన్స్‌ తవ్వి తీస్తుంటే, పవన్‌ అభిమానులమని చెప్పుకునే కొందరు, వీరిద్దరి సమావేశాన్ని తప్పుపడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేరుతో, ఓ ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ చర్చనీయాంశమైంది.

ఓడలు బండ్లు అవుతాయి...బండ్లు ఓడలు అవుతాయి....చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు, జగన్ అరెస్ట్ అయ్యాడు....."చట్టం ఇప్పుడు తన పని తాను చేసింది"....అని వెంటనే కామెంట్‌ చేశాడు రామ్‌ చరణ్‌ సంతోషం పట్టలేక వైఎస్‌ కుటుంబం అంటే మెగా కుటుంబానికి అంత కసి!!....అలాంటి తండ్రీ కొడుకులు, అదే జగన్‌ దర్శనం కోసం పడిగాపులు పడి, అనుమతి సంపాదించారు. తమ సినిమాను ప్రత్యేకంగా చూడాల్సిందిగా ప్రార్థించబోతున్నారు.....అదే కాల మహిమ అంటే!!....దటీజ్ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారూ ఇదీ ఆ పోస్టింగ్‌ సమగ్ర రూపం. ఇదే ఇప్పుడు, సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేరుతో, ఈ పోస్ట్‌ రావడంతో, ఈ వ్యవహారం పొలిటికల్‌ సర్కిల్స్‌లో కాక రేపుతోంది.

అయితే, సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ పోస్టింగ్‌పై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి స్పందించారు. ఈ పోస్ట్‌కు, తనకు ఎలాంటి సంబంధం లేదున్నారు. మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవంటున్నారు చెవిరెడ్డి. చిరంజీవిపై తన అభిమాన సంఘం పేరిట సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వార్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తనకు ట్విట్టర్‌ అక్కౌంట్లు కాని, ఫేస్‌బుక్‌ అక్కౌంట్లుగాని లేవని స్పష్టం చేశారు. జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ర్పాచారం చేస్తోందన్నారు. తన అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణం తొలగించాల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.

చెవిరెడ్డి రియాక్షన్‌తో, అసలు ఆ పోస్టింగ్‌కు, ఆ‍యనకు సంబంధంలేదని తెలిపోయింది. మరి ఎవరు ఆ పోస్ట్ చేశారు, ఎందుకు చేశారు...వారి లక్ష్యమేంటి...జగన్‌-చిరుల సమావేశాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నది మాత్రం, అంతుచిక్కడం లేదు. అయితే, జగన్‌-చిరంజీవి సమావేశంపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అన్నారు.

చిరంజీవి కథానాయకుడుగా, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో, సైరా చిత్రం ఇటీవలె విడుదలై, సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి, రామ్‌చరణ్‌లు సినిమా ప్రమోషన్‌ కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మధ్యనే తెలంగాణ గవర్నర్‌ తమిళసై ని కలిసి, సినిమా వీక్షించాలని కోరారు. చిరు ఆహ్వానంతో సైరా వీక్షించిన తమిళసై, చిరంజీవి నటన అద్భుతమన్నారు. సైరా ప్రతి యువకుడూ, ప్రతి భారతీయుడూ చూడాల్సిన చిత్రమని పొగిడారు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌ను సైతం, సైరా వీక్షించాలని కోరబోతున్నారు చిరంజీవి. కానీ వీరిద్దిర లంచ్ మీటింగ్‌, పొలిటికల్‌‌‌ వంటకాలను మసలా వేసి, వండివారుస్తోంది. జగన్‌తో చిరు మీటింగ్‌‌, పవన్‌ కల్యాణ్‌కు రాజకీయంగా ఇబ్బందిగా మారుతుందని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, అసలు జగన్‌ అంటే ఏమాత్రం పడని మెగా కుటుంబంతో, సీఎం సమావేశమేంటని, వైసీపీ కార్యకర్తలు కొందరు కళ్లెర్రజేస్తున్నారు. దీనికి నిదర్శనం, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేరుతో సోషల్‌ మీడియా పోస్టింగ్‌. చూడాలి, వీరి భేటి ఇంకెలాంటి రాజకీయ రచ్చకు దారి తీస్తుందో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories