Telugu States: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధం

Chandrababu Writes Letter to Revanth Reddy, Proposes Meeting to Address Bifurcation Issues
x

Telugu States: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధం

Highlights

Chandrababu: తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధం అయ్యింది.

Chandrababu: తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైనా.. ఇంకా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. 6వ తేదీన మీరున్న చోటుకే వస్తానని లేఖలో ప్రస్తావించారు. చంద్రబాబు లేఖపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు లేఖపై నేడు రేవంత్ రెడ్డి లేఖ రాసే అవకాశం ఉంది. అన్ని సవ్యంగా జరిగితే ఈనెల 6వ తేదీన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ప్రజా‎భవన్‌లోనే ఇద్దరు భేటీ అయ్యే అవకాశం ఉంది. విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

విభజన అంశాలపై కూర్చొని మాట్లాడుకుంటే.. ఎంత ఝఠిలమైన సమస్య అయినా సమసిపోతుందని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. మరి దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా మిగిలి ఉన్న సమస్యలు ఓ కొలిక్కి రానున్నాయా..? సీఎం హోదాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి తొలి సమావేశం ఎలా జరగనుంది..? అనే అంశం ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తైంది. ఆస్తుల విభజనకు సంబంధించిన అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్, పటౌడీ హౌజ్, నర్సింగ్‌ హాస్టల్‌ను మాత్రమే విభజిస్తూ ఈ ఏడాది మార్చి 15న కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకొంది. దీనికి రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి. కీలకమైన తొమ్మిది, పది షెడ్యూళ్లలోని ఆస్తులను విభజించాల్సి ఉంది. వాస్తవానికి ఈ రెండు అంశాలే తెలుగు రాష్ట్రాలకు ముఖ్యం కానున్నాయి. మరి రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో వీటిపై ఏమేరకు క్లారిటీ వస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories