ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి.. ఇప్పుడే పొత్తులపై చర్చ అవసరం లేదంటున్న చంద్రబాబు!

Chandrababu Orders to be Ready for Elections Anytime | AP News
x

ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి.. ఇప్పుడే పొత్తులపై చర్చ అవసరం లేదంటున్న చంద్రబాబు!

Highlights

Chandrababu: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని బాబు ఆదేశాలు

Chandrababu: ఏపీలో పొత్తులు ఎత్తులుపై టీడీపీ లెక్కలు సిద్ధం చేస్తోంది. నిన్న మొన్నటి వరకు అధికార వైసీపీని డీ కొట్టడం కోసం లెక్కల సిద్ధం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు తాజాగా రూటు మార్చి కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని తెలుగు తమ్ముళ్లకు ఆదేశాలు ఇస్తున్న చంద్రబాబు సరికొత్త వ్యూహంతో ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.

ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న చంద్రబాబు టీడీపీ జెండాని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎగురవేయాలని చూస్తున్నారు. అధికార వైసీపీని గద్దె దించేందుకు తన ముందున్న అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తూన్నారు. ఇటీవల కాలంలో తెర వెనుక వ్యూహాలు సిద్ధం చేస్తూ అడుగులు వేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మహానాడు నిర్వహణ విజయంతో ప్రజల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్న బాబు వైసీపీని ఒంటరిగా డీ కొనలేమని నిర్దారణకు వచ్చారట. పొత్తుల కోసం జరుగుతున్న ప్రయత్నంలో ఇటీవల కొత్త చర్చకు తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన వ్యతిరేక ఓటు బ్యాంకు వ్యాఖ్యల తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సింగల్‌గా రావాలని ఒకవైపు వైసీపీ సవాల్ విసురుతుంటే.. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి పోరుకు నడుం బిగించారు. అయితే కలిసి పోరాటం చేస్తే వైసీపీ ఓటమి చెందుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే వైసీపీ మొదటి నుంచి చెబుతున్నట్టు టీడీపీ, జనసేన ఒకటే అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని వెనకడుగు వేస్తున్నారట చంద్రబాబు.

పవన్ కళ్యాణ్ పెట్టిన మూడు ఆప్షన్లు విషయంలో ఎవరిని మాట్లాడొద్దని అంటున్నారట చంద్రబాబు. పొత్తుల ఆప్షన్ల విషయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి పవన్ ప్రస్తావించిన అంశాలపై ఎవరు మాట్లాడినా అధికార వైసీపీ మొదటి నుంచి టీడీపీ విషయంలో చేసిన దుష్ప్రచారానికి మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారట చంద్రబాబు. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్నామని, ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏ క్షణమైనా విపక్షమైన, ప్రతిపక్షమైన వైఫల్యాలను అధికార వైసీపీ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి పవన్ విషయంలో ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా సింగిల్‌గా ఎన్నికలకు వెళ్లడానికి సిద్దం అవుతున్నారన్న చర్చ నడుస్తోంది.

నిన్న మొన్నటి వరకు జనసేన విషయంలో ఆచితూచి అడుగులు వేసిన చంద్రబాబు.. బీజేపీ విషయంలోను అంతే జాగ్రత్తతా వ్యవహరిస్తున్నారట. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలతో ఏపీలో బలమైన వైసీపీని ఎదుర్కోవడానికి విపక్షాలు ఏకమవుతున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షంగా అడుగులు వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వైసీపీని ఎదుర్కోవడానికి జతకట్టిన పెద్దగా ప్రయోజనం లేదని చంద్రబాబు చెబుతున్నారని సమాచారం. ఏపీలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితిని చక్కదిద్ది విపక్షాలను అనుకూలంగా మార్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి.. సార్వత్రిక ఎన్నికల నాటికి ఏకమయ్యే అంశాన్ని ఇప్పుడు పెద్దగా పట్టించుకోవద్దని సూచిస్తున్నారట. అయితే ఏపీలో టీడీపీకి ఉన్న క్యాడర్ దృష్ట్యా సొంతంగా బరిలోకి దిగుతామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories