Chandrababu Naidu: రాజకీయ కక్షసాధింపులు లేవు: శ్రీకాకుళంలో చంద్రబాబు
Chandrababu Naidu: తప్పు చేసిన వారిని వదిలిపెట్టను.. అలా అని రాజకీయ కక్షసాధింపులకు పాల్పడనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు.
Chandrababu Naidu: తప్పు చేసిన వారిని వదిలిపెట్టను.. అలా అని రాజకీయ కక్షసాధింపులకు పాల్పడనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
కట్టెల పొయ్యితో మహిళలు పడిన బాధలు తనకు తెలుసునన్నారు. దీపం పథకం సిలిండర్ ఇచ్చి మహిళల కష్టాలు తీర్చానని.. డ్వాక్రా సంఘాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని ఆయన అన్నారు. ఎన్నికల్లో టీడీపీ,జనసేన, బీజేపీ కార్యకర్తలు రాజీలేని పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. కార్యకర్తల కృషితోనే కూటమికి బంపర్ మెజారిటీ వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ కు లబ్దిదారులు చెల్లించిన డబ్బులు 48 గంటల్లో రీఫండ్ చేస్తామని చెప్పారు. ఆర్ధిక సమస్యలు ఉన్నా పథకాలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఉచితంగా ఇసుక ఇస్తున్నందున అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నాసిరకం మద్యం ఉండదు... బెల్ట్ షాపులు ఉండవని ఆయన తేల్చి చెప్పారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని ఆయన తేల్చి చెప్పారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire