Chandrababu: డే-1 కంప్లీట్‌.. తొలిరోజు ముగిసిన చంద్రబాబు కస్టడీ

Chandrababu Custody Ended On The First Day
x

Chandrababu: డే-1 కంప్లీట్‌.. తొలిరోజు ముగిసిన చంద్రబాబు కస్టడీ

Highlights

Chandrababu: రేపు మరోసారి చంద్రబాబును విచారించనున్న సీఐడీ అధికారులు

Chandrababu: స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు తొలిరోజు కస్టడీ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు చంద్రబాబును ప్రశ్నించారు సీఐడీ అధికారులు. చంద్రబాబును విచారించిన 12 మంది సీఐడీ అధికారుల బృందం.. రెండు టీమ్‌లుగా విడిపోయి విచారణ జరిపింది. స్కిల్ స్కాం కేసుకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ను ఎలా నిర్ణయం చేశారు..? సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు..? అగ్రిమెంట్‌ ఏ విధంగా జరిగింది..? జీవోకు విరుద్ధంగా ఒప్పందం ఉండటం ఏమిటి..? పీఏ పెండ్యాల శ్రీనివాస్‌కు రూ.241 కోట్లు ఎందుకు ఇచ్చారు..? అనే అంశాలపై ప్రశ్నించారు సీఐడీ అధికారులు. చంద్రబాబు ఇచ్చిన సమాదానాల వీడియో, ‎ఆడియో రికార్డు చేశారు. రేపు మరోసారి చంద్రబాబును విచారించనున్నారు సీఐడీ అధికారులు

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉదయం 9 గంటల 30 నిమిషాల తర్వాత చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నారు సీఐడీ అధికారులు. ఉదయం 10 గంటల సమయంలో చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. ఆ తర్వాత గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు సీఐడీ అధికారులు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సెకండ్ హాఫ్ విచారణ ప్రారంభించింది సీఐడీ బృందం.

Show Full Article
Print Article
Next Story
More Stories