Chaganti Koteswara Rao: నాలుగు మంచి మాటలు చెప్పాలని.. ఆ పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా

Chaganti Koteswara Rao:  నాలుగు మంచి మాటలు చెప్పాలని.. ఆ  పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా
x
Highlights

Chaganti Koteswara Rao To Take Ap Govt Post: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పోస్టుల్లో విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా...

Chaganti Koteswara Rao To Take Ap Govt Post: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పోస్టుల్లో విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావును నిర్ణయించింది. ఈ పదవిని తీసుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.

పెద్దలు, గురువులపై గౌరవంగా ఉండేవిధంగా పిల్లలను సత్ప్రవర్తనతో ఉండేలా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తి, గురుభావం తగ్గడం ఆందోళన కల్గించే అంశమన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవాటు చేసుకోవాలని సూచించారు.

ఏపీ సర్కార్ నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ్య ఆధ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా కేబినెట్ ర్యాంక్ తో కీలక పదవి దక్కింది. ఆయనను విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.

2ఏళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. అయితే చాగంటి ఈ పదవిని తీసుకుంటారా లేదా అనే చర్చ జోరుగా సాగింది. ఎందుకంటే 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, 2023లో అప్పటి వైఎస్సార్ సీపీ సర్కార్ మరోసారి పదవులు ఇచ్చిన ఆయన తిరస్కరించారు. తనకు ఈ పదవి దక్కడంపై చాగంటి కోటేశ్వరరావు కూడా స్పందించారు. కానీ ఈ సారి ఆ పదవిని తీసుకుంటానంటూ స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వం పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ముఖ్యమైన బాధ్యతను తనకు అప్పగిస్తూ సలహాదారుగా నియమించడాన్ని స్వాగతిస్తున్నాను అన్నారు. తాను అంగీకారం తెలపడం పదవుల కోసం కాదని..తనకు ఇప్పుడు ఏ గౌరవం కూడా తక్కువ కాలేదన్నారు.

తన వయస్సు 65ళఏళ్లను గుర్తు చేశారు. ఆరోగ్యంగా ఏమైనా చేయగలిగేది మరో 5 లేదా 6 ఏళ్లు మాత్రమే అన్నారు. ఈ లోగా తాను అన్నివేల మంది పిల్లలను కూర్చోబెట్టలేనన్నారు. ప్రభుత్వ పరంగా వాళ్లు కూర్చోబెడితే తాను నాలుగు మంచిమాటలు చెప్పగలన్నారు.

అందుకే తాను ఈ పదవి తీసుకోవడానికి ఒప్పుకున్నట్లు చెప్పారు. తాను చెప్పే మాటలతో పిల్లలకు మేలు జరిగితే అంతకంటే సంతోషం ఏముంటుందన్నారు. అందుకే తనకు ప్రభుత్వం అప్పగించిన ఈ కర్తవ్యాన్ని సంతోషంగా అంగీకరిస్తున్నట్లు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories