నేడు కర్నూలు, గుంటూరు జిల్లాలలో కేంద్ర బృందం పర్యటన

నేడు కర్నూలు, గుంటూరు జిల్లాలలో కేంద్ర బృందం పర్యటన
x
Representational Image
Highlights

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా నిన్న 54 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1887కి చేరింది. 842మంది డిశ్చార్జ్ కాగా, 41మంది చనిపోయారు. ప్రస్తుతం 1004 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఏపీలో అత్యధికంగా కరోనా కేసులు కర్నూల్, గుంటూరు జిల్లాలో నమోదు అవుతున్నాయి.

ఇక కర్నూల్ లో ఇప్పటివరకు 547 కేసులు నమోదు కాగా, 342 యాక్టివ్ కేసులు ఉండగా, 191 మంది కరోనా నుంచి కొలుకున్నారు. 14 మంది చనిపోయారు. ఇక గుంటూరు జిల్లా విషయానికి వచ్చేసరికి మొత్తం 374 కేసులు నమోదు కాగా, 202 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 164మంది కరోనా నుంచి కొలుకున్నారు. 8 మంది మృతి చెందారు.

రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో కేంద్రబృందం పర్యటిస్తోంది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ప్రత్యేక బృందం రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నిన్న విజయవాడలో పర్యటించిన కేంద్ర వైద్య బృందం ఈరోజు కర్నూల్, గుంటూరు జిల్లాలో పర్యటించనుంది. గుంటూరు, కర్నూలు జిల్లా లలో రెండు రోజుల పాటు పర్యటించే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాకు డాక్టర్ సంజయ్ సాధు, డాక్టర్ ఎం.డోబె వెళ్లనున్నారు. గుంటూరు జిల్లాకు డాక్టర్ బాబీ పాల్, డాక్టర్ నందిని భట్టాచార్య వెళ్లనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories