ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో తొలిరోజు కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. హెలికాప్టర్‌లో అనంతపురం జిల్లా వజ్రకరూరుకు చేరుకున్న సెంట్రల్ టీమ్...

ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో తొలిరోజు కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. హెలికాప్టర్‌లో అనంతపురం జిల్లా వజ్రకరూరుకు చేరుకున్న సెంట్రల్ టీమ్ సభ్యులు‌.. అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం వజ్రకరూరు, గుంతకల్లు మండలాల్లో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు కేంద్ర బృందం సభ్యులు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన నష్టాన్ని నివేదిక రూపంలో బృందం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. 6వేల 386 కోట్లకు పైగా సాయాన్ని కోరుతున్నట్టు చెప్పారు. తక్షణ సాయంగా 840 కోట్లు విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. మత్స్య, పశుసంవర్దక, పట్టు పరిశ్రమల రంగాలకు భారీ మొత్తంలో నష్టం వచ్చిందని వర్షాలకు రహదారులు కూడా ఘోరంగా దెబ్బతిన్నాయని నివేదికలో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories