YS Viveka Murder Case Updates: వై.ఎస్‌ వివేకా హత్య కేసులో కొన‌సాగుతున్న సీబీఐ విచారణ

YS Viveka Murder Case Updates:  వై.ఎస్‌ వివేకా హత్య కేసులో కొన‌సాగుతున్న సీబీఐ విచారణ
x
cbi probe in ys viveka
Highlights

YS Viveka Murder Case Updates: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ద‌ర్యాప్తు ముమ్మరం చేసింది. 12వ రోజు నగరంలోని సెంట్రల్ జైలు ఆవరణలో సీబీఐ విచారణ కొనసాగుతోంది.

YS Viveka Murder Case Updates: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ద‌ర్యాప్తు ముమ్మరం చేసింది. 12వ రోజు నగరంలోని సెంట్రల్ జైలు ఆవరణలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుల‌ను అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో బుధవారం ఉదయం సీబీఐ ఎదుట పులివెందుల‌కు చెందిన‌ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి హాజరయ్యారు. ఆయ‌న కడప ఎంపీ వై.ఎస్‌ అవినాష్‌ రెడ్డికి సన్నిహితుడు. ఈ కేసులో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్‌ రెడ్డి పేరు ఉండ‌టంతో.. ఇవాళ సీబీఐ ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యారు.సాక్ష్యాలు తారుమారు చేయడానికి ఈయన కూడా సహకరించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. గతంలో సిట్ కూడా శివశంకర్‌ రెడ్డిని ఐదు రోజులపాటు విచారించింది. శంకర్‌ రెడ్డికు క్రిమిన‌ల్ రిక్డారు ఉండ‌టంతో.. వివేకా కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సీబీఐ అధికారులు అతన్ని లోతుగా విచారణ చేస్తున్నారు.

నేడో రేపో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులను విచారించనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ కుటుంబసభ్యుల విచారణ అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారయణ రెడ్డిలను సీబీఐ విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నిన్న సీబీఐ విచారణకు వివేకా కుమార్తె సునీత హాజర‌య్యారు. సెంట్రల్ జైల్లో ఉన్న గెస్ట్ హౌస్ లో ప్రత్యేక విచారణ అధికారి నేతృత్వంలో సునీతను 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. సీబీఐ అధికారులు. హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని పరిస్థితులపై సునీతను ద‌గ్గ‌ర్నుంచి వివ‌రాలు సేక‌రించారు. ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories