Chandrababu Cabinet: చంద్రబాబు మంత్రివర్గంలో కులాలవారీ ప్రాతినిధ్యం.. బీసీలకు 8, జనసేనకు 3 మంత్రి పదవులు

Caste wise preference in Chandrababu Cabinet 8 for BCs,3 for Janasena
x

Chandrababu Cabinet: చంద్రబాబు మంత్రివర్గంలో కులాలవారీ ప్రాతినిధ్యం.. బీసీలకు 8, జనసేనకు 3 మంత్రి పదవులు

Highlights

Chandrababu Cabinet: కేబినెట్‌ కూర్పులో సీనియారిటీతోపాటు...పార్టీ విధేయతను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బీసీలకు పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. 8 నుంచి 9 మంది బీసీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు...రెండోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11.27నిమిషాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్...చంద్రబాబు చేత ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితేచంద్రబాబు తో పాటు ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న దానిపైఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు 20 మందికిపైగా మంత్రివర్గంలో చోటు లభించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై చంద్రబాబు, నారా లోకేశ్... నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. జనసేన పార్టీ నుంచి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలుగా ఘన విజయం సాధించారు. ఆ పార్టీకి 3 నుంచి 4 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్‌కు సైతం మంత్రి లభించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే సుజనా చౌదరికి ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం.

కేబినెట్‌ కూర్పులో సీనియారిటీతోపాటు...పార్టీ విధేయతను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బీసీలకు పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. 8 నుంచి 9 మంది బీసీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు సమాచారం. ఎస్సీల్లో ఉండే రెండు వర్గాలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్టీ, వైశ్యులు, మైనార్టీలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించనున్నారు. కమ్మ, కాపు సామాజిక వర్గాలకు...నాలుగు చొప్పున మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి మూడు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎస్టీల్లో గుమ్మడి సంధ్యారాణి లేదా తోయక జగదీశ్వరిల్లోకి ఒకర్ని కేబినెట్ లోకి తీసుకోనున్నారు.

వైశ్య సామాజిక వర్గం నుంచి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ పోటీపడుతున్నారు. వీరిలో ఒకరికి కచ్చితంగా పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. మైనార్టీల్లో నంద్యాల నుంచి ఎన్ఎండీ ఫరూక్‌, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, మదనపల్లి ఎమ్మెల్యే మహ్మద్ షాజహాన్ బాషా విజయం సాధించారు. వీరిలో ఒకరికి కేబినెట్‌లో బెర్త్ దక్కే అవకాశం ఉంది. కమ్మ సామాజి వర్గం నుంచి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, నారా లోకేశ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నాదెండ్ల మనోహర్, దేవినేని ఉమా మహేశ్వర రావు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాపుల్లో కొణిదెల పవన్ కళ్యాణ్, గంటా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు, బొండా ఉమా మహేశ్వర రావు, కన్నా లక్ష్మీ నారాయణ, పొంగూరు నారాయణలకు...రెడ్డి సామాజికవర్గంలో కె సూర్య ప్రకాష్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రెడ్డప్పగారి మాధవీరెడ్డిలకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీల్లో వంగలపూడి అనిత, నక్కా ఆనంద్ బాబు, అలాగే కూన రవికుమార్, బేబి నాయన, చింతకాయల అయ్యన్న పాత్రుడు, కొణతాల రామకృష్ణ, కొల్లు రవీంద్రలను కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories