ఏలూరులో తగ్గుముఖం పడుతున్న వింత వ్యాధి!

ఏలూరులో తగ్గుముఖం పడుతున్న వింత వ్యాధి!
x
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 5 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 612కు చేరింది.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 5 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 612కు చేరింది. 569 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం ఏడుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. అలాగే.. విజయవాడ, గుంటూరు ఆస్పత్రుల్లో 35 మందికి చికిత్స అందుతోంది. వింత వ్యాధి బారిన పడ్డవారిలో ఎక్కువ శాతం మంది 13 నుంచి 35 ఏళ్ల వయస్సున్నవారేనని అధికారులు ప్రకటించారు. 35 ఏళ్లకు పైబడినవారు 198 మంది, 1 నుంచి 12 ఏళ్లు వయసున్న వారు 76 మంది ఉన్నట్టు తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు వింత వ్యాధితో ముగ్గురు చనిపోయినట్టు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories