Can Pawan Kalyan mingle with BJP: పద్మవ్యూహాన్ని పవన్ చేధిస్తారా?
Can Pawan Kalyan mingle with BJP: కమలంతో చేతులు కలిపిన జనసేనాని ప్రస్తుతం ఇరుకునపడ్డారా...? బీజేపీ విధానాలతో తన నినాదాలకు ముప్పు వస్తోందా...? బీజేపీ...
Can Pawan Kalyan mingle with BJP: కమలంతో చేతులు కలిపిన జనసేనాని ప్రస్తుతం ఇరుకునపడ్డారా...? బీజేపీ విధానాలతో తన నినాదాలకు ముప్పు వస్తోందా...? బీజేపీ స్ట్రాటజీ నే గుడ్డిగా నమ్మేస్తే, అన్న చిరంజీవిలాగే తన పొలిటికల్ కెరీర్ కూడా ప్రమాదంలో పడబోతోందా...? కమలంతో ముందుకు వెళ్తే కదనరంగంలో వెనకబడతామని జనసైనికులు భావిస్తున్నారా...? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ స్టోరీ చూసేయండి.
జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ పయనంపై ఏపీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఫ్యాన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్, ఏం చేసినా సంచలనమే. సినిమాల్లో తిరుగులేని స్టామినా ఉన్న పవన్, రాజకీయాల్లో కూడా అలాగే దూసుకువెళ్తారని అందరూ అంచనా వేశారు. కొంతవరకూ 2014 ఎన్నికల్లో బీజేపీ, టిడిపి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి నాటి గెలుపుకు తనవంతు కీలకపాత్ర పోషించారు కూడా
అయితే పవర్‌లోకి వచ్చిన తర్వాత టిడిపి ప్రభుత్వం, పవన్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత రాజధానిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపైనా, ఎమ్మార్వో వనజాక్షిపై నాటి టిడిపి ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారంపైనా, ఇతర ప్రజాసమస్యలపైనా అప్పుడప్పుడు అధికార టిడిపిని పవన్ ప్రశ్నిస్తూనే వచ్చారు. అనంతరక్రమంలో మారిన రాజకీయపరిణామాల నేపథ్యంలో, 2019 ఎన్నికల్లో టిడిపి, బీజేపి, జనసేన విడిగా బరిలో దిగాయి. ఫలితాలు ఈ మూడు పార్టీలకు షాకిచ్చేలానే వచ్చాయి.
దీంతో 2019 ఎన్నికల తర్వాత పవన్, బ్యాక్ టు మూవీస్ అని అంతా అనుకున్నారు. అయితే సినిమాలు చేయబోనని పవన్ చెప్పటం, ప్రాణం పోయేవరకూ రాజకీయాల్లో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడతానని చేసిన ప్రకటన, పార్టీ శ్రేణుల్లో కాస్త జోష్ నింపింది. ఆ తర్వాత బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపిన పవన్, రాబోయే రోజుల్లో కమలంతో నా ప్రయాణం ఖాయమని తేల్చి చెప్పారు. దీంతో జాతీయపార్టీ అండదండలు ప్రాంతీయపార్టీలకు ఎప్పుడైనా అవసరమే కాబట్టి, బీజేపీతో దోస్తీ తమకు లాభిస్తుందని జనసైనికులు భావించారు. పార్టీ పెట్టి ఆరేళ్లయినా పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు చేయకపోయినా, బీజేపీతో తమకు లాభమే జరుగుతుందని వారంతా ఆశించారు.
అయితే స్టోరీ ఒకలా ఉంటే, స్క్రీన్ ప్లే మరోలా ఉన్నట్లు బీజేపీతో, జనసేన భావించిన రాజకీయ సమీకరణాలు అంతగా వర్కవుట్ కావటం లేదన్నది ఆపార్టీ నేతల అంతర్గత భావన. రాష్ట్రంలో బీజేపీతో చెలిమి వల్ల పెద్దగా ఒరగకపోగా రివర్స్ లో నష్టమే ఎక్కువ జరుగుతోందని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు రాజధాని అమరావతి అంశాన్నే ఉదాహరణగా చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో ల్యాడ్ పూలింగ్ ప్రక్రియ జరుగుతున్నపుడు, రైతులకు మద్దతుగా పవన్ నిలబడినపుడు స్థానికంగా మంచి ఆదరణ కనిపించింది. కానీ ఇప్పుడు మూడు రాజధానుల అంశంతో అమరావతి భవిష్యత్తే ప్రశ్నార్దకంగా మారుతున్న క్రమంలో ఎలా పోరాడాలన్నదానిపై స్పష్టత రాకపోవటానికి కారణం, కమలంపార్టీయేనని జనసైనికులు గుర్రుమంటున్నారు. టిడిపి, వైసీపీలను రాజీనామాలు చేయమని చెబుతున్నామే తప్ప, మనమేం చేయాలో తెలియని పరిస్థితికి బీజేపీతో దోస్తీనే కారణమని వారు వాపోతున్నారు.
దీంతో రాజకీయంగా అన్నయ్య చిరంజీవి ఎదుర్కొన్న ఫలితాల్నే తమ్ముడు పవన్ కూడా ఫేస్ చేస్తారా అన్న ప్రశ్నలు, ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. పీఆర్పీని విలీనం చేసేవరకూ చిరంజీవిపై ఒత్తిడి తెచ్చి ఆ తర్వాత మెగాస్టార్‌ను కరివేపాకులా వాడుకున్న కాంగ్రెస్ తరహా వైఖరినే, బీజేపీ కూడా అనుసరిస్తుందన్న అనుమానాలు, ఇప్పుడు జనసేన నాయకుల్ని వేధిస్తున్నాయి. మూడు రాజధానులకు అనుకూలమని బీజేపీ తేల్చిచెబుతుంటే, ఆ పార్టీ వైఖరికి భిన్నంగా వెళ్తే తలెత్తే పరిణామాలపైనే పవన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాజధానిని కదిల్చే శక్తి జగన్ కు లేదు ఒకవేళ అదే జరిగితే వెనక్కి తెప్పిస్తాం..ఈ అంశంపై బీజేపీతో ఒప్పందం ఉందని గతంలో చెప్పిన పవన్ ప్రస్తుత కార్యాచరణ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. మరి బీజేపీ పద్మవ్యూహంలోకి వెళ్లిన పవన్ దాన్ని ఛేదించుకుని బయటకు వస్తాడా..? లేక ఆ పార్టీ విధానాలతో చివరకు మరో చిరంజీవిలా మారతాడా అన్నది కాలమే తేలుస్తుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire