ఇవాళ సీఐడీ అధికారుల కాల్‌ డేటా కేసు విచారణ

Call Data Case Investigation of CID officers Today
x

ఇవాళ సీఐడీ అధికారుల కాల్‌ డేటా కేసు విచారణ

Highlights

Chandrababu: చంద్రబాబు బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌లను.. ఇవాళ విచారించనున్న హైకోర్టు న్యాయమూర్తి

Chandrababu: స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌, మధ్యంతర బెయిల్‌ కోరుతూ ఆయన వేసిన అనుబంధ పిటిషన్‌ ఈరోజు వెకేషన్‌ బెంచ్‌ ముందు విచారణకు రానుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి వ్యాజ్యంపై విచారణ జరపనున్నారు. ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ నిధులు మళ్లించారనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఏసీబీ కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా చంద్రబాబుకు సంబంధించిన మెడికల్‌ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

మరోవైపు స్కిల్ స్కాంకేసులో సీఐడీ తనను అరెస్ట్ చేసిన సమయంలో అక్కడ ఉన్న సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ పిటిషన్‌పై నిన్న విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీఐడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువురిని ఫోన్‌ ద్వారా సంప్రదించారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని వాదించారు. దర్యాప్తు సమయంలో కేసుకు సంబంధించి అధికారులు పలువురిని సంప్రదిస్తుంటారని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఆ సమయంలో అధికారుల కాల్‌డేటా ఇవ్వడం గోప్యతకు భంగమని అన్నారు. ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ తరఫు న్యాయవాది వాదించారు. ఇరు వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories