CM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం

Cabinet Review Meeting By CM Jagan | AP News
x

CM Jagan: ప్రారంభమైన సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ

Highlights

CM Jagan: మంత్రివర్గ విస్తరణ తర్వాత రెండోసారి భేటీ

CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.. మొత్తం 42 అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత జరిగే రెండో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోకున్నారు. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. ఉమ్మడి జిల్లాల ZP చైర్మన్ల పదవీకాలం పూర్తయ్యేవరకూ కొత్త జిల్లాలకు కొనసాగించేలా చట్ట సవరణకు చర్యలు చేపట్టనున్నారు. ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ప్రభుత్వం.

అలాగే రాష్ట్రంలో పలు పరిశ్రమల స్థాపనకు క్యాబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 35 సంస్థలకు 112 ఎకరాల భూ కేటాయింపులు చేయాలని మంత్రిమండలి నిర్ణయించనుంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ చేపట్టనున్న 3700 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. పులివెందులలో, కృష్ణాజిల్లా మల్లవెల్లిలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలపై కూడా మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories