Kurnool: కల్వర్టును ఢీకొన్న బస్సు.. ఇద్దరు మృతి

Bus Collided Culvert Two Died
x

Kurnool: కల్వర్టును ఢీకొన్న బస్సు.. ఇద్దరు మృతి

Highlights

Kurnool: పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Kurnool: కర్నూలు జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద కల్వర్టును ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌ శ్రీనివాసులుతో పాటు.. ప్రయాణికుడు రాములు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదానికి అతివేగం, నిద్రమత్తే కారణమని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories