Live Updates: ఈరోజు (09 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 09 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | నవమి రా.12-18 తదుపరి దశమి | మఖ నక్షత్రం తె.4-05 తదుపరి పుబ్బ | వర్జ్యం సా.4-18 నుంచి 5-52 వరకు | అమృత ఘడియలు రా.1-43 నుంచి 3-18 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-05 | సూర్యాస్తమయం: సా.05-23

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Somashila Project Updates: సోమశిల జలాశయం రెండో దశకు నేడు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన!
    9 Nov 2020 3:32 AM GMT

    Somashila Project Updates: సోమశిల జలాశయం రెండో దశకు నేడు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన!

    నెల్లూరు:

    -- సోమశిల జలాశయం హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకం రెండో దశకు నేడు ముఖ్యమంత్రి శంకుస్థాపన.

    -- దుత్తలూరు వద్ద శిలాఫలకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంఖుస్థపన చేయనున్న సిఎం.

    -- హాజరు కానున్న మంత్రులు గౌతమ్, అనీల్,ఎమ్మెల్యేలు.

    -- రెండో దశ హై లెవల్ కాలువ ద్వారా ఉదయగిరి నియోజకవర్గానికీ సోమశిల జలాలు.

  • Krishna District Updates: కృష్ణా జిల్లా మైలవరంలో విషాదం!
    9 Nov 2020 3:22 AM GMT

    Krishna District Updates: కృష్ణా జిల్లా మైలవరంలో విషాదం!

    కృష్ణా జిల్లా..

    -మైలవరం లో కుటుంబ కలహాలతో వివాహిత ఉరి వేసుకుని మృతి

    -మృతురాలు మారేపల్లి మాధవి (28)

    -మృతికి కారణం భర్త, అత్త మామలు అంటున్న మృతురాలి కుటుంబసభ్యులు

    -పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త భరత్, అత్త పుస్పమ్మ, పరారీలో మామ దేవానందం

  • Chittoor District Updates: కశ్మీర్ ఎదురుకాల్పుల్లో మృత్యువాతపడిన చిత్తూరు జిల్లా ప్రవీణ్ కుమార్ రెడ్డి..
    9 Nov 2020 3:19 AM GMT

    Chittoor District Updates: కశ్మీర్ ఎదురుకాల్పుల్లో మృత్యువాతపడిన చిత్తూరు జిల్లా ప్రవీణ్ కుమార్ రెడ్డి..

    చిత్తూరు జిల్లా..

    -కశ్మీర్ ఎదురుకాల్పుల్లో మృత్యువాతపడిన చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి

    -గత 18 సంవత్సరాలుగా మద్రాస్ రెజిమెంట్లో సైనికుడిగా పనిచేస్తున్న జవాను

    -అతడు హవల్టార్గా పనిచేస్తూ కమాండో శిక్షణ తీసుకున్న ప్రవీణ్

    -ప్రస్తుతం కశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్

    -వీర జవానుకు భార్య రజిత, కుమారుడు, కుమార్తె తల్లితండ్రులుచీకల ప్రతాప్ రెడి,సుగుణమ్మలు ఉన్నారు

    -సోమవారం రాత్రి స్వగ్రామం చేరుకోనున్న వీరజవాన్ భౌతిక కాయం

    -రెడ్డిపల్లె గ్రామంలో విషాదఛాయలు

  • Tirumala-Tirupati Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
    9 Nov 2020 3:11 AM GMT

    Tirumala-Tirupati Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..

    తిరుమల సమాచారం..

    -నిన్న శ్రీవారిని దర్శించుకున్న 32,297 మంది భక్తులు.

    -తలనీలాలు సమర్పించిన 10,959మంది భక్తులు.

    -నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.18 కోట్లు.

    -అలిపిరి, విష్ణు నివాసంలో సర్వదర్శనం టోకెన్ల జారీ చేస్తున్న టీటీడీ.

    -24 గంటల పాటు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న టీటీడీ.

Print Article
Next Story
More Stories