Nandyal: దారుణం..ప్రేమించలేదని ఇంటర్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన బాలుడు

Nandyal: దారుణం..ప్రేమించలేదని ఇంటర్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన బాలుడు
x
Highlights

Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం జరిగింది. బాలికపై బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రేమించలేదనే కారణంతోనే ఇంటర్ చదువుతున్న బాలికపై...

Nandyal: నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం జరిగింది. బాలికపై బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రేమించలేదనే కారణంతోనే ఇంటర్ చదువుతున్న బాలికపై బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోయింది. బాలుడికి మంటలు అంటుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి.

నంద్యాల పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..వెల్దుర్తి మండలం సామార్లకోటకు చెందిన బాలిక, కలుగొట్లకు చెందిన బాలుడు ఇద్దరూ ఇంటర్ చదువుతున్నారు. బాలుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడు. దీంతో బాలిక పేరెంట్స్ ఆమెను నందికొట్కూరులోని అమ్మమ్మ ఇంటికి పంపించారు. 6 నెలల క్రితం బాలుడు అక్కడికి వెళ్లాడు.

దీంతో ఈ విషయాన్ని ఆమె తన పేరేంట్స్ కు చెప్పింది. బాలిక స్నేహితులు ఎవరు వచ్చినా ఇంటికి రానివ్వొద్దని వారు సూచించారు. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిని తర్వాత బాలుడు మళ్లీ అక్కడికి వెళ్లాడు. చదువుకునే గదిలో బాలిక నిద్రిస్తున్న సమయంలో డోర్ కొట్టాడు. డోర్ తెరవడంతో లోపలికి వెళ్లిన అతను గడియపెట్టాడు. ఆ తర్వాత కాసేపటికి బాలికపై పెట్రోల్ పోసీ నిప్పంటించాడు.

దీంతో ఆమె గట్టిగా కేకలు పెడుతూ అక్కడికక్కడే మరణించింది. బాలుడికి మంటలు అంటుకోవడంతో గాయాలు అయ్యాయి. అతను గడియ తీసి పారిపోతుండగా కుటుంబ సభ్యులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ బాలుడిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories