Tirumala: తిరుమలలో పసిబాలుడిపై చిరుత దాడి.. అలిపిరి నడక మార్గంలో ఘటన..

Boy attacked by Leopard on Alipiri walkway
x

Tirumala: తిరుమలలో పసిబాలుడిపై చిరుత దాడి.. అలిపిరి నడక మార్గంలో ఘటన..

Highlights

Tirumala: ప్రసన్నాంజనేయ స్వామి గుడి సమీపంలో బాలుడిపై చిరుత దాడి

Tirumala: అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేళ్ల బాలుడుపై చిరుత దాడి చేసింది. కర్నూలుజిల్లా ఆదోనికి చెందిన భక్తులు తిరుపతి నుంచి తిరుమలకు నడక మార్గం గుండా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రసన్నాంజనేయ స్వామి గుడి సమీపంలో బాలుడిపై దాడిచేసిన చిరుత పొదల్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. శ్రీవారి భక్తులు, భద్రతా సిబ్బందితో కలిసి కేకలు వేయడంతో అక్కడే వదిలేసి వెళ్లి పోయింది. నడక దారిలో చిరుత దాడి చేయడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

విషయాన్ని తెలుసుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ ఘటనాస్థలానికి చేరుకుని చిరుత దాడిపై ఆరాతీశారు. దేవుడి దయవల్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడని తిరుమల శ్రీవారి భక్తులు అభిప్రాయం వ్యక్తంచేశారు.

తీవ్రంగా గాయపడిన బాలుడిని తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌశిక్‌గా గుర్తించారు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలుడిని టిటిడి ఈవో ధర్మారెడ్డి పరామర్శించారు. బాలుడికి ప్రాణాపాయం లేదని తెలిపారు. బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. దాడి జరిగిన ప్రాంతంలో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. కాలినడక మార్గంలో భక్తులను యథావిధిగా అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చిరుత దాడి నేపథ్యంలో భక్తులను గుంపులుగా పంపుతున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories