Botsa Satyanarayana: కేబినెట్ పక్షాళనపై స్పందించిన మంత్రి బొత్స

Botsa Satyanarayana About AP Cabinet Expansion
x

Botsa Satyanarayana: ప్రభుత్వం రద్దు చేయాల్సిన అవసరం మాకేంటి?

Highlights

Botsa Satyanarayana: ఒక ఎమ్మెల్సీ ఓడిపోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏంటి?

Botsa Satyanarayana: ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. మంత్రివర్గంలో మార్పులు సీఎం జగన్ ఇష్టమని కేబినెట్ ప్రక్షాళనపై వస్తున్న ఊహాగానాలపై వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్సీ ఓడిపోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏంటని ఎమ్మెల్సీ ఫలితాలపై స్పందించారు. లోపాలను సరిద్దికుని మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటామన్నారు. మరోవైపు రేపటి నుంచి ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖ ఉండాలని తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. కొన్ని దుష్ట శక్తులు న్యాయవ్యవస్థ లో ఉన్న లొసుగులతో అడ్డుకుంటున్నారని రాజధానుల న్యాయవివాదాలపై వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణ అజెండాగా వచ్చే ఎన్నికలకు వెళ్తామని బొత్స సత్యనారాయణ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories