Prakasam Barrage: విజయవాడలో ప్రకాశం బ్యారేజ్‌కు పగుళ్లు

Boats Hit the Gates of Prakasam Barrage
x

Prakasam Barrage: విజయవాడలో ప్రకాశం బ్యారేజ్‌కు పగుళ్లు

Highlights

Prakasam Barrage: విజయవాడలో ప్రకాశం బ్యారేజ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. కృష్ణా నదిలో వరద ఉధృతికి ఉదయం మూడు బోట్లు కొట్టుకువచ్చాయి.

Prakasam Barrage: విజయవాడలో ప్రకాశం బ్యారేజ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. కృష్ణా నదిలో వరద ఉధృతికి ఉదయం మూడు బోట్లు కొట్టుకువచ్చాయి. ఆ బోట్లు బ్యారేజ్‌ 69వ కానా దగ్గర వేగంగా ఢీకొట్టాయి. దీంతో 69వ కానా దగ్గర సిమెంట్‌ బిళ్లలకు పగుళ్లు ఏర్పడ్డాయి. సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మరోవైపు బోట్లు గేట్ల ముందే అడ్డుపడ్డాయి. వరద నీరుకు అడ్డుగా ఉండటంతో అధికారులతో పాటు ఈ దృశ్యాలను చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

కాసేపటికే బోట్లను పక్కకు లాగినట్లు తెలిసింది. బోట్లు బలంగా ఢీకొట్టిన ప్రాంతంలో బ్యారేజ్‌కి కూడా పగుళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రమాందం పొంచి ఉందనేది తెలియరాలేదు. 70 గేట్ల నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ దాదాపు 11 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories