Black Fungus: ప్రకాశం జిల్లాలో బ్లాక్ ఫంగస్‌ కేసుల కలవరం

Black Fungus Cases Founded in Prakasam District
x

బ్లాక్ ఫంగస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Black Fungus: జిల్లా కేంద్రంలో ఒకరికి, మార్కాపురంలో ఐదుగురికి లక్షణాలు

Black Fungus: ఇప్పటికే సెకండ్‌ వేవ్‌తో భయంగుప్పిట్లో జీవిస్తున్న జనాలకు కొత్తగా బ్లాక్‌ ఫంగస్‌ కలవరపెడుతోంది. వైరస్ బారినపడి కోలుకున్నవారికి బ్లాక్ ఫంగస్ ముప్పుగా పరిణమించింది. ఇప్పటివరకు వినడం తప్ప ఎలాంటి కేసులు నమోదు కాలేదని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో ప్రకాశం జిల్లాను బ్లాక్ ఫంగస్ కలవర పెడుతోంది. జిల్లా కేంద్రంలో ఒకరు, మార్కాపురంలో ఐదుగురు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. కోవిడ్ చికిత్సకు స్టెరాయిడ్స్ వాడకం వల్ల దుష్ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ వ్యాధికి సరైనా వైద్యం అందించడం తెలియకపోయినా.... బాధితుల భయాలను క్యాష్ చేసుకొని ప్రైవేట్‌ ఆస్పత్రులు వ్యాపారం మొదలు పెట్టాయి. రోగుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీ తెలిసి కూడా జిల్లా అధికార యంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories