Vizag: "ఉక్కు" ఉద్యోగుల బాధ్యత కేంద్రానిదే - సునీల్ ధియోధర్

Vizag Steel: The responsibility of Steel Employees is Central - Sunil Deodhar
x

సునీల్ ధియోధర్ (ఫోటో: ఫైల్ ఇమేజ్)

Highlights

Vizag Steel Plant: దేశవ్యాప్త విధానంలో భాగంగానే ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తున్నామని సునీల్ దేవధర్ అన్నారు.

Vizag Steel Plant: దేశవ్యాప్త విధానంలో భాగంగానే ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తున్నామని ప్లాంటు ఉద్యోగుల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని బీజేపీ నేత సునీల్ దేవధర్ అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన పార్టీ పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రైవేటీకరణ గురించి ప్లాంటు ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

తిరుపతి ఉపఎన్నిక పై చర్చ...

ఈసమావేశంలో తిరుపతి ఉపఎన్నికలో కేంద్రసర్వీసు విశ్రాంత అధికారిని బరిలోకి దించే అంశంపై చర్చలు జరిపారు. నేతలు వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఉపఎన్నికపై ప్రకటన వచ్చాక అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. అవసరమైనప్పుడల్లా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కొన్ని పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.

ఆగ్రహంతో కార్మిక సంఘాలు...

విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్ర ఉద్ధృతమైంది. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చిన కార్మిక సంఘాలు.. ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఈ నెల 15 నుంచి రోజుకో రూపంలో నిరసన తెలియజేయాలని ఉక్కు పరిరక్షణ సమితి నిర్ణయించింది. అవసరమైతే రాజకీయ, సినిమా ప్రముఖులను అడ్డుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాజకీయ నేతల నుంచి మద్దతు లభిస్తున్నా..? ఏపీ రాజకీయ పార్టీల నుంచి కానీ.. టాలీవుడ్ నుంచి కాని సరైన మద్దతు రాకపోవడంతో కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories