వాలంటీర్ల ద్వారా వైసీపీ అక్రమాలకు పాల్పడుతోంది-నాదెండ్ల

వాలంటీర్ల ద్వారా వైసీపీ అక్రమాలకు పాల్పడుతోంది-నాదెండ్ల
x

వాలంటీర్ల ద్వారా వైసీపీ అక్రమాలకు పాల్పడుతోంది-నాదెండ్ల

Highlights

*పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా.. *చూడాలని గవర్నర్‌ను కలిసిన బీజేపీ, జనసేన నేతలు *ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తకుండా.. *చర్యలు చేపట్టేలా చూడాలంటూ విన్నవించుకున్న నేతలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార వైసీపీ ఏకగ్రీవాలకు రంగం సిద్ధం చేస్తుంటే ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు జనసేన, బీజేపీ నేతలు.

పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని గవర్నర్‌ను కోరినట్లు బీజేపీ, జనసేన నేతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టేలా చూడాలని విన్నవించామన్నారు. అదేవిధంగా ఏకగ్రీవాలకు ప్రోత్సహిస్తున్న వైసీపీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీ నేతలు ప్రలోభాలు, బెదిరింపులతో ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహార్‌ అన్నారు. వాలంటీర్ల ద్వారా వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇక నామినేషన్ల విధానాన్ని ఆన్‌లైన్‌లో చేయాలని గవర్నర్‌ను కోరినట్లు నాదెండ్ల వివరించారు.

ఇదిలా ఉండగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు ఆరోపించారు. ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తే గృహనిర్భందాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు సోము వీర్రాజు‌. మొత్తానికి ఏపీ పంచాయతీ సమరం రంజుగా మారింది. ఇన్నాళ్లు కోర్టుల్లో వాదనలు జరిగితే ఇప్పుడు గవర్నర్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories