AP High Court: బీజేపీ హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

BJP House Motion Petition Hearing in High Court
x

ఆంధ్రప్రదేశ్ (హై కోర్ట్)

Highlights

AP High Court: కౌంటర్‌ దాఖలు చేయాలని ఎస్‌ఈసీ, పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశం

AP High Court: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శుక్రవారం బీజేపీ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేసింది. బీజేపీతో పాటూ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలంటూ మరో ముగ్గురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను తిరిగి కొనసాగిస్తూ గురువారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేశారు.

మరోవైపు ఈ ఎన్నికలపై ఎస్ఈసీ నీలం సాహ్నీ ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్‌కు టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎంలు బహిష్కరించాయి. పాత నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. వైసీపీతో పాటూ మిగిలిన పార్టీల ప్రతినిధులు హాజరుకాగా పరిషత్ ఎన్నికల నిర్వహణపై పార్టీలతో ఎస్ఈసీ చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories