Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..ఆ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు..టీటీడీ కీలక నిర్ణయం

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..ఆ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు..టీటీడీ కీలక నిర్ణయం
x
Highlights

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. మీరు తిరుమలకు వెళ్లే ప్లానింగ్ లో ఉంటే ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. జనవరి 10వ తేదీ నుంచి 19వ...

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. మీరు తిరుమలకు వెళ్లే ప్లానింగ్ లో ఉంటే ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠద్వారా దర్శనాలను కల్పిస్తున్నట్లు బీఆర్ నాయుడు ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే ఈ సమయంలో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమల ఆలయంలో ప్రతి ఏడాది వైకుంఠ ద్వారా దర్శనాలను కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు టీటీడీ ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులను పరిగణలోనికి తీసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

మాజీ ప్రజాప్రతినిథులు, మాజీ అధకారులు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించలేమని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. జనవరి 10 నుంచి 19 వరకు ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. అంతేకాదు పసిబిడ్డలు, దివ్యాంగులు, వ్రుద్దులు, రక్షణశాఖ, ఎన్నారై తదితరులు విశేష దర్శనాలను ఈ పదిరోజులపాటు రద్దు చేస్తున్నామని బీఆర్ నాయుడు తెలిపారు.

దర్శన టోకెన్లు , స్పెషల్ దర్శన్ టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని టోకెన్లు లేని భక్తులను తిరుమల కొండపైకి అనుమతిస్తామని తెలిపారు. స్వామివారి దర్శనానికి అనుమతి ఉండదన్నారు. భక్తులకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం నిర్ణీత సమాయానికి క్యూలైన్ల దగ్గరకు చేరుకోవాలని సూచించారు.

గతంలో మాదిరిగా భారీ క్యూలైన్లు ఉండవని..ఈ సారి సాధ్యమైనంత వరకు గరిష్ట సంఖ్యలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని..దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్నభక్తులకే శ్రీవారి దర్శనమని బీఆర్ నాయుడు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories