విశాఖ రాజకీయాల్లో చిచ్చురేపిన షిప్

Bangladesh Ship Near Tenneti Park off the Coast of Visakhapatnam
x

విశాఖ రాజకీయాల్లో చిచ్చురేపిన షిప్

Highlights

Visakhapatnam: విశాఖ తెన్నేటి తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌక

Visakhapatnam: తెన్నేటి సముద్రతీరాన ఓ ఓడ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండేళ్ల క్రితం కొట్టుకొచ్చిన ఓడను ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంటే పర్యావరణాన్ని పాడుచేసే పనులు చేపట్టవద్దని విపక్షాలు ఆందోళనకు దిగాయి. విశాఖలో చిచ్చురేపుతున్న ఓడ కధాకమామిషు ఏంటో ఇపుడు చూద్ధాం..

విశాఖ సాగర తీరాన తెన్నేటి పార్కు సమీపంలోకి కొట్టుకొచ్చిన M.V. MAA CARGO SHIP రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. విశాఖ నగరాన్నితరచూ తుఫాను వణికిస్తుంటుంది. రెండేళ్ల క్రితం తీవ్రవాయుగుండానికి ఊహించని విధంగా ఓ షిప్పు కొట్టుకొచ్చింది. సామాన్యులు ఆశ్చర్యపోతే పోలీసు యంత్రాంగం బెంబేలెత్తింది. పోలీసులు,నేవి,కొస్ట్ గార్డ్,మైరైన్ పోలీసులు చుట్టుముట్టారు. తీరా అరా తీస్తే అది విశాఖ పోర్టుకు బోగ్గును తీసుకోచ్చి తిరిగి వెళ్ళడానికి సిద్దం అవ్వగా వాయుగుండం కారణంతో పోర్టులో ఆగిపోయిందని సమాచారం. అదే వాయుగుండం తీవ్రవాయుగుండం మారిన తరువాత అలల ఉదృతి ఎక్కువకావడంతో హ్యంగర్ సరిగా వేయ్యకపోవడంతో తెన్నేటి తీరానికి కొట్టుకొచ్చింది.

తెన్నేటి పార్కు చేరిన ఓడ సందర్శకులతో సందడిగా మారింది. ఓడను కాపాడేందుకు పోలీసుల సైతం కొద్ది నెలలపాటు కాపాలా కాశారు. విశాఖ పోర్టు ట్రస్ట్, కోస్ట్‌ గార్డ్‌, మినిస్ట్రీ ఆఫ్‌ షిప్పింగ్, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్, మర్చెంటైల్‌ మెరైన్‌ డిపార్ట్‌మెంట్, ఇండియన్‌ నేవీ, హిందూస్థాన్‌ షిప్‌ యార్డ్‌ ఇలా మొత్తం ఎనిమిది సంస్థలు షిప్‌ను తిరిగి సముద్రంలోకి పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన సఫలం కాకపోవడంతో పోలీసులు ఆంక్షలు ఎత్తివేశారు. సందర్శకులు రావడం మెుదలు పెట్టారు. షిఫ్ మాత్రం అక్కడ నుండి కదల్లేదు. దీంతో ఈ నౌకను ఇక్కడే వదిలేసేందుకు యాజమాన్యం నిర్ణయించుకుంది.

విశాఖ సాగరతీరాన తెన్నేటి పార్కు సమీపంలో నిలిచిన కార్గో షిప్‌ను ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మారీటైమ్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం నౌకను వారం రోజుల పాటు పరిశీలించి, టూరిజం శాఖకు నివేదిక ఇచ్చింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఈ కార్గో నౌకను ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా మార్చాలని నిర్ణయించింది. ఫ్లోటింగ్ రెస్టారెంట్ రూపకల్పనకు సంబంధించి కేబినెట్‌ కూడా ఆమోదముద్ర వేసింది. నాలుగు కోట్ల 50 లక్షలకు విక్రయించేందుకు యాజమాన్యం సిద్ధమవగా, రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ఒక కోటి 25 లక్షలకు పర్యాటక శాఖ దక్కించుకుంది.

నౌకను అరుదైన ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా తీర్చిదిద్దేందుకు టూరిజం శాఖ సిద్ధమవుతోంది. ప్రపంచదేశాల పర్యాటకులను ఆకర్షించేలా, టూరిస్ట్‌ ఎమినిటీస్‌తో కూడిన ప్రాజెక్ట్‌గా డిజైన్‌ చేశారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతర శుభ కార్యాలు నిర్వహించేందుకు అనుగుణంగా బాంక్వెట్‌ హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. దేశ విదేశీ రుచులు అందుబాటులో ఉండేలా 500 మందికి సరిపడా మల్టీ క్యూసిన్‌ రెస్టారెంట్‌, ఒక సందర్శకుడికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేయాలని భావించారు. ప్రజాభాగస్వామ పద్ధతిలో 10కోట్ల 50 లక్షలతో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ను మిస్టర్‌ గిల్‌ మెరైన్స్‌ సంస్థతో కలిపి అభివృద్ధి చేయనున్నారు. తెన్నేటి పార్కుతో కలిపి దీనిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంతో, ఆ పార్కును కూడా తమకు అప్పగించాలని గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్, విశాఖ రీజినల్ డెవలప్ మెంట్ అథారిటీ కోరుతున్నాయి.

విశాఖతీర ప్రాంతానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌ కార్గో నౌక ను తక్షణమే ఇక్కడ నుంచి తొలగించాలని తేలియాడే రెస్టారెంట్ లో ‌-మునిగిపోతున్న ప్రజాధనం పేరుతో నిరసన చేపట్టారు. మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories