AP News: ఏపీలో కొనసాగుతున్న టీడీపీ బంద్.. ఆందోళనకారులను పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పోలీసులు

Bandh Continues In AP State
x

AP News: ఏపీలో కొనసాగుతున్న టీడీపీ బంద్.. ఆందోళనకారులను పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పోలీసులు

Highlights

AP News: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కనిపించని బంద్ ప్రభావం

AP News: ఏపీలో టీడీపీ చేపట్టిన బంద్ కొనసాగుతోంది. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమలులో ఉన్నందున్న ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అక్కడక్కడా అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా ఆందోళన జరుపుతున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. బంద్‌కు మద్దతుగా జనసేన సంఘీభావం తెలిపింది.

చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించిందిన విషయం నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషను శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని ఆమె నివాసంలో 2 రోజులుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఇంట్లో నిర్బంధించారు. పలాసలో టీడపీ శ్రేణులు రోడ్డెక్కాయి. పలాస మండలం మొగిలిపాడు, కంబిరిగాం సర్వీస్ రోడ్లపై జగన్ ఫొటోను దగ్ధం చేశారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విఠల్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పలాస ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

నరసన్నపేట జాతీయ రహదారి టీడీపీ కార్యకర్తలు దిగ్బందించారు. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కొంతమంది కార్యకర్తలు లారీలు, బస్సుల కింద దూరి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీ కార్యకర్త నారంశెట్టి మున్నా వాటర్ ట్యాంకర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అయితే టీడీపీ నేత బేబీ నాయన మున్నా ట్యాంక్ దిగాలని వేడుకోవడంతో సుంకరి సాయి రమేష్ సాయంతో కిందికి దిగారు మున్నా... పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో టీడీపీ నాయకులు నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. బ్రాహ్మణపల్లి గ్రామ సమీపంలో అద్దంకి.. నార్కెట్‌పల్లి హైవేపై ఆందోళన జరిపారు. సీఎం డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై టెర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.

గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు, జనసేన నేతల మధ్య వాగ్వాదం... జరిగింది. ఈక్రమంలో తోపులాట చోటుచేసుకుంది. గుంటూరులో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు బస్ స్టాండ్ ఎదుట కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యంతోపాటు పలువురు పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. పట్టణంలో వ్యాపారాలు యథావిధిగా నడిచాయి. అనంతపురం జిల్లా ధర్మవరంలో పోలీసుల వలయాన్ని చేధించుకుని బయటకు వచ్చారు పరిటాల శ్రీరాం.... ధర్మవరంలోని ఎర్రగుంట సర్కిల్‌లోని టీడీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి గాంధీనగర్ సర్కిల్‌లో ఆందోళన చేశారు పరిటాల శ్రీరాం.... కాగా ఆందోళన చేస్తున్న పరిటాల శ్రీరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టును కార్యకర్తలు అడ్డుకున్నారు.నియర్ నేత బోండా ఉమ విజయవాడలో మాట్లాడుతూ... నాలుగున్నరేళ్ల జగన్ పాలన అవినీతిలో కూరుకుపోయిందని, ఓటమి భయం పట్టుకున్న జగన్ ప్రజల దృష్టి మరల్చడానికి కుట్ర చేశారని ఆరోపించారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించారని, సంబంధం లేని కేసులో చంద్రబాబు పేరును ఇరికించారని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories