Balineni Srinivasa Reddy: వైసీపీ హయాంలో 87శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయి

Balineni Srinivasa Reddy Said 87 percent people got welfare schemes during YCP regime
x

Balineni Srinivasa Reddy: వైసీపీ హయాంలో 87శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయి 

Highlights

Balineni Srinivasa Reddy: నేటి నుంచి ఈనెల 20 వరకు కార్యక్రమం.. 7 లక్షల మంది కార్యకర్తలు, గృహసారథులు భాగస్వాములవుతారు

Balineni Srinivasa Reddy: ఇప్పటి వరకు ఏ పార్టీ చేయని రీతిలో జగనన్నే మా భవిష్యత్తు పేరిట వినూత్న కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టిందన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన 7 లక్షల మంది కార్యకర్తలు, గృహసారథులు భాగస్వాములవుతారని తెలిపారు. నేటి నుంచి ఈనెల 20 వరకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు.

కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని కోటి 60లక్షల గడపలకు తమ పార్టీ కార్యకర్తలు, గృహసారథులు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, పార్టీ విధానాలను వివరిస్తారని తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలోని దాదాపు 87శాతం మందికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. ప్రజలంతా మళ్లీ జగనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు బాలినేని శ్రీనివాసరెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories