అవంతి, ద్రోణం రగడ వెనక అసలు కథేంటి?

అవంతి, ద్రోణం రగడ వెనక అసలు కథేంటి?
x
Highlights

ఔను, వాళ్లిద్దరూ గొడవపడ్డారు. బహిరంగ వేదికగా మాటల తూటాలు పేల్చుకున్నారు. స్టేజి దద్దరిల్లేలా సూటిపోటీ మాటలతో కుళ్లబొడుచుకున్నారు. వాళ్లేదో, అధికార,...

ఔను, వాళ్లిద్దరూ గొడవపడ్డారు. బహిరంగ వేదికగా మాటల తూటాలు పేల్చుకున్నారు. స్టేజి దద్దరిల్లేలా సూటిపోటీ మాటలతో కుళ్లబొడుచుకున్నారు. వాళ్లేదో, అధికార, ప్రతిపక్ష నాయకులు కాదు, అధికార పార్టీ నేతలే. ఒకరు మంత్రి, మరొకరు మరో కీలకమైన పదవిలో ఉన్న నాయకుడు. కానీ పార్టీ పరువు, ప్రభుత్వ ప్రతిష్ట, వంటి ఆలోచనలేం చేయకుండా, వేదికమీదే రుసరుసలాడుకున్నారు. దీంతో పార్టీ హైకమాండ్‌ చాలా సీరియస్‌ అయ్యిందట. మున్సిపల్‌ ఎన్నికల ముంగిట్లో ఇదేం గొడవా అంటూ, చురకలు వేసిందట. ఇంతకీ వాళ్లిద్దరి ఓపెన్‌ ఫైటింగ్‌ వెనక, అసలు కథేంటి?

విశాఖపట్నం జిల్లాలో నివురుగప్పిన నిప్పులా వున్న వైసీపీ విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్రంగా, గొడవలు రాజుకుంటున్నాయి. మొన్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌తో అవంతి శ్రీనివాస్‌‌ గొడవపడ్డారని తెలిసింది. తాజాగా, మరో కీలక నాయకుడితో అవంతికి రగడ జరిగింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, వీఎంఆర్డీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మధ్య కాసేపు ఆర్గ్యూమెంట్‌ సాగింది. దీంతో అక్కడి వాతావరణం అనూహ్యంగా వేడెక్కింది. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వీఎంఆర్‌డీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఒకరినొకరు మాటామాటా అనుకోవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు షాకయ్యారు.

బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మంత్రి అవంతి శ్రీనివాస్, వీఎంఆర్‌డీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, అధికారులు, వైఎస్ఆర్సీపీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రసంగిస్తుండగా అదే సమయంలో ద్రోణంరాజు శ్రీనివాస్‌ కలెక్టర్‌తో మాట్లాడుతున్నారు. దీంతో కాస్త ఇబ్బందిగా ఫీలైన మంత్రి ''అన్నా శీనన్నా విశాఖ నగరంలోని పెదముషిడివాడలో ఉన్న మీకు, గ్రామీణ కష్టాలు తెలియవు. కొద్దిగా వినండన్నా'' అని ద్రోణంరాజు శ్రీనివాస్‌ను ఉద్దేశించి కామెంట్లు చేయడంతో, ఒక్కసారిగా సభా ప్రాంగణం హీటెక్కింది.

అవంతి శ్రీనివాస్‌ కామెంట్లతో ద్రోణంరాజు ఒకింత నొచ్చుకున్నారు. దీంతో తాను ప్రసంగించిన టైమ్‌లో, ఘాటుగా బదులిచ్చారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి, పట్టణంలో పెరిగిన తనకు, రెండు ప్రాంతాల గురించి అవగాహన వుందన్న ద్రోణంరాజు, ఎక్కడి నుంచో వలసవచ్చి, కాలేజీలు పెట్టావని, అవంతిని ఉద్దేశించి బదులిచ్చారు. చిన్నా, పెద్దా చూసి మాట్లాడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగలేదు సంవాదం. ద్రోణంరాజును చల్లబరిచే ప్రయత్నం చేశారు అవంతి శ్రీనివాస్. శీనన్నా అపార్థం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరించానంతే అవన్నీ మీకు తెలియవని కాదంటూ' సర్దిచెప్పడానికి ట్రై చేశారు.

మొత్తానికి విశాఖలో నివురుగప్పిన నిప్పులా వున్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్టు కనిపిస్తున్నాయి. త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీలో విభేదాలు ఇలాగే వుంటే, చాలా కష్టమని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విభేదాలు పక్కనపెట్టి, పార్టీ పటిష్టానికి కృషి చేయాలని కోరుతున్నారు. నేతల మధ్య కోల్డ్‌వార్‌ ఇలాగే కంటిన్యూ అయితే, అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళతామని అంటున్నారు స్థానిక నేతలు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories