TDP Leader: టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం

Attack On TDP Leader Anam Venkata Ramana Reddy
x

TDP Leader: టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం

Highlights

TDP Leader: మారణాయుధాలతో ఆనంపై దాడికి యత్నించిన దుండగులు

TDP Leader: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. బీవీ నగర్‌లోని కిలారి వెంకటస్వామి నాయుడి నివాసం నుండి బయల్దేరుతున్న సమయంలో.. మారణాయుధాలతో దుండగులు ఆనంపై దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన కిలారి వెంకట్ నాయక్ స్వామి నాయుడు సహా పలువురు ఎదురుదాడికి దిగడంతో.. దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. అయితే కొంతమందిని స్థానికులు పట్టుకొని పోలీసులుకు అప్పగించినట్లు తెలుస్తోంది. వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడి చేశారన్న సమాచారం తెలుసుకున్న పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు కిలారి వెంకటస్వామి నాయుడు నివాసానికి చేరుకుని అక్కడ ఉన్న వెంకటరమణారెడ్డిని పరామర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories