Ashwini Vaishnaw: కర్నూల్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. పెట్టుబడుల వర్షం కురిపించిన కేంద్రం

Ashwini Vaishnav said that the Center will invest Rs.2,786 crores to establish an industrial hub in Orvakal of Kurnool district
x

Ashwini Vaishnaw: కర్నూల్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. పెట్టుబడుల వర్షం కురిపించిన కేంద్రం

Highlights

Ashwini Vaishnaw: ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌లో 45వేల మందికి ఉపాధి

Ashwini Vaishnaw: ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రీయల్ పార్క్‌ల ఏర్పాటుకు కేటినెట్ ఆమోదం తెలిపింది. అందుకోసం 25 వేల కోట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ కొత్త ప్రాజెక్ట్‌ల ద్వారా 1.5 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయని భావిస్తోంది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో, కడప జిల్లా కొప్పర్తిలో ఈ పారిశ్రామిక హబ్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2,786 కోట్ల వ్యయంతో 2వేల 621 ఎకరాల్లో ఓర్వకల్లు పారిశ్రామిక హబ్, 2వేల 137 కోట్లతో 2,596 ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories