రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్న అసని తుపాను..

Asani Cyclone Live Updates Its Going to Weak by Tomorrow | AP Live News
x

రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్న అసని తుపాను..

Highlights

Asani Cyclone Live Updates: కొన్ని గంటల్లో కొనసీమ అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం...

Asani Cyclone Live Updates: ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను బలహీనపడింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, నర్సాపురానికి 30కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అనూహ్యంగా దిశ మార్చుకుంటున్న తుపాను అసని.. నర్సాపురం తీరానికి దిగువన అల్లవరానికి సమీపంలో భూభాగంపైకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు తెలిపింది.

భూభాగంపైకి వచ్చిన అనంతరం సాయంత్రంలోగా యానాం వద్ద తిరిగి సముద్రంలోకి తుపాను ప్రవేశించే అవకాశం ఉంది. అనంతరం క్రమంగా బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. పూర్తిగా బలహీనపడే వరకూ తీరం వెంబడే పయనిస్తుందని తెలిపింది. కోస్తాంధ్ర తీరానికి అతి దగ్గరగా రావటంతో గాలుల తీవ్రత తగ్గింది. తుపాను పరిసర ప్రాంతాల్లో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా కోస్తాంధ్ర తీర ప్రాంత జిల్లాల్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది.

ఇవాళ కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రేపు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్, విజయనగరం, శ్రీకాకళం, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories