ఏసీబీ కోర్టులో మళ్లీ మొదలైన వాదనలు

Arguments Resumed In ACB Court
x

ఏసీబీ కోర్టులో మళ్లీ మొదలైన వాదనలు

Highlights

Chandrababu: విరామం తర్వాత లూథ్రా వాదనలు

Chandrababu: చంద్రబాబు తీరుపై సీఐడీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో జాప్యం జరిగేలా చంద్రబాబు వ్యవహరించారని సీఐడీ అధికారులు ఆరోపించారు. కోర్టుకు వెళ్లే సమయంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని తెలిపారు. 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలనే నియమాన్ని జాప్యం చేసేందుకు చంద్రబాబు నాయుడు యత్నించారని సీఐడీ పేర్కొంది. అయితే చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టిన సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు అభియోగాలు వ్యక్తం చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబుకు అవగాహన ఉందని తెలిపింది. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బు రిలీజ్‌ అయ్యిందని..ఈ నేపథ్యంలో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంతో సీఐడీ పోలీసులు మెమో దాఖలు చేశారు.

రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఐడీ ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబే కుట్రకు ప్రధాన సూత్రదారి అని సీఐడీ ఏసీబీ కోర్టుకు రిమాండ్‌ రిపోర్టును సమర్పించింది. మొత్తం 28పేజీలతో కూడిన చంద్రబాబు రిమాండ్‌ రిపోర్టును సమర్పించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ జరిగిన తీరును సీఐడీ వివరించింది. కాగా, ఓపెన్‌ కోర్టుకు విచారణకు సీఐడీ జడ్జి హాజరుకానున్నారు. ఇక చంద్రబాబు తరపున న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ అంశంపై సీఐడీ జడ్జి ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ రోజు సెలవు కాబట్టి ఓపెన్‌ కోర్టులో విచారణ చేయడం తప్పనిసరి కాదని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories