AP Weather Report: రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

AP Weather Report: రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
x
రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం..
Highlights

AP Weather Report: వరుస అల్పపీడన ప్రభావాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. పది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, రేపట్నుంచి కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలియజేసింది.

AP Weather Report: వరుస అల్పపీడన ప్రభావాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. పది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, రేపట్నుంచి కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలియజేసింది. ఇప్పటికే కొనసాగుతున్న వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తుండటంతో వాటి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగాయి. మరికొన్ని గ్రామాలకు వెళ్లే రహదారులు సైతం కొట్టుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి అల్పపీడనం వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని అటు అధికార వర్గాలతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పరివాహక ప్రాంతాల్లో నీట మునిగిన గ్రామాలు, పంటలను ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు.

తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్‌ జోన్ 20 °N అక్షాంశం వెంబడి సెంట్రల్ ఇండియా మీదుగా ఉపరితల ద్రోణి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతున్న అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉండటం వల్ల ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగష్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేగాక తదుపరి 42 గంటల్లోగా ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏపీకి రాగల మూడు రోజుల పాటు వర్ష సూచన

తూర్పు-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ, రేపు(బుధవారం) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు చాలా చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో చాల చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories