ఏపీలో టెన్త్ పేపర్ లీక్.. వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం.. టూటౌన్ ఠాణాలో ఫిర్యాదు...

AP Tenth Question Paper Leak Issue in Chittoor and Nandyal | AP Breaking News Today
x

ఏపీలో టెన్త్ పేపర్ లీక్.. వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం.. టూటౌన్ ఠాణాలో ఫిర్యాదు...

Highlights

Tenth Question Paper Leak: *స్కూల్లో పోలీసు, విద్యాశాఖ అధికారుల దర్యాప్తు *లీకేజీకి సంబంధించి ఇన్విజిలేటర్‌పై చర్యలు

Tenth Question Paper Leak: ఏపీలో రెండేళ్ల తర్వాత టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.. అయితే ఎగ్జామ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నాపత్రం లీకయ్యిందన్న వార్తలు కలకలం రేపాయి. చిత్తూరులో పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే ప్రశ్నాపత్రం వాట్సాప్ లలో చక్కర్లు కొట్టింది. సమాచారం తెలుసుకున్న డిఈవో జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు.. పేపర్ లీక్ కాలేదని వదంతులు క్రియేట్ చేసిన వారిపై చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో డిఈవో పురుషోత్తం ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ప్రశ్నాపత్రం లీకేజీపై వదంతులు నమ్మొద్దని కలెక్టర్ హరినారాయణన్ ప్రకటించారు.

నంద్యాల జిల్లాలో కూడా పేపర్ లీక్ అయినట్లు సమాచారం. కొలిమిగుండ్ల మండలం ఆంకిరెడ్డి పల్లె లో జిల్లా పరిషత్ హైస్కూలులో పేపర్ లీక్ అయినట్లు తెలుస్తోంది. 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. స్కూల్ కు చేరుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు వివరాలు తెలుసుకున్నారు. ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన ఇన్వెజిలేటర్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు. పేపర్ లీకేజీపై రాష్ట్రస్థాయిలో పోలీసు, విద్యాశాఖ విచారణ చేపట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories