SSS ఫోర్స్.. ఏపీలో పీక్స్ కు చేరిన పొలిటికల్ హీట్...

AP Political Heat Increasing Day by Day YSRCP vs Oppositions | Live News Today
x

SSS ఫోర్స్.. ఏపీలో పీక్స్ కు చేరిన పొలిటికల్ హీట్...

Highlights

AP News: బాదుడే బాదుడే కార్యక్రమంతో ప్రజల్లోకి ప్రతిపక్షం...

AP News: ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. బాదుడే బాదుడే కార్యక్రమం ద్వారా ప్రతిపక్ష పార్టీ ప్రజల్లోకి వెళ్తుంటే.. అధికార పార్టీ సీఎం ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వడానికి సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేస్తుంది. సీఎం అప్పగించిన బాధ్యతలపై ఫోకస్ పెట్టారు SSS.. వైసీపీ పెద్దలు కార్యాచరణను షురూ చేశారు. సజ్జల, సాయిరెడ్డి సుబ్బారెడ్డి సీఎం అప్పగించిన టాస్క్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాలని కసరత్తులు చేస్తున్నారు.

తాజాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు మొన్నటి వరకు మంత్రులుగా ఉన్న సీనియర్లు జిల్లా ప్రెసిడెంట్లు అయ్యారు. కొంత మంది రీజినల్ కో ఆర్డినేటర్లు అయ్యారు. మరోవైపు పార్టీకి పిల్లర్స్ గా ఉన్న సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల బాధ్యతలు కూడా మారాయి.

ఏపీలో పొలిటికల్ హీట్ స్టార్ట్ అవ్వడంతో సైలెంట్ గా పని మొదలు పెట్టారు SSS నాయకులు,. ముఖ్యంగా నేతల మధ్య పంచాయితీ, అసంతృప్తులను బుగ్గగించే పనిలో పడ్డారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా కొంత మందిని పిలిపించుకొని మాట్లాడుతున్నారు.

సాయిరెడ్డి తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుంటూ పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్ళాలి అనే దానిపై సమావేశాల్లో చర్చిస్తున్నారు. ఇక మరొక కీలక నేత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రకు మకాం మార్చి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ నేతలను కో-ఆర్డినేట్ చేస్తున్నారు. 11 నుంచి గడప గడప కు ysr కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే దాని దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్రలో పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇలా ముగ్గురు కీలక నేతల సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతలు, తమ పై అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకునేందుకు కృషి చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories