East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో ఆపరేషన్ గ్రీన్ గంజా హంట్

AP Police Started Operation Green Ganja Hunt in East Godavari | AP Latest News
x

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో ఆపరేషన్ గ్రీన్ గంజా హంట్

Highlights

East Godavari: జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఆపరేషన్..

East Godavari: తూర్పు గోదావరి జిల్లా ఆపరేషన్ గ్రీన్ గంజా హంట్‌కి పోలీసులు శ్రీకారం చుట్టారు. జిల్లా నుంచి అత్యధికంగా గంజాయి రవాణా కావడంతో ఆపరేషన్ గ్రీన్ గంజా హంట్ పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు తెర లేపారు. ఇందులో భాగంగా మోతుగూడెం మండలం, ఒడిషా క్యాంప్ ప్రాంతానికి స్వయంగా వెళ్లి గంజాయి మొక్కలను తొలగించారు జిల్లా ఎస్పీ. పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు కూడా వెళ్లి అక్కడి గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అనంతరం గంజాయి పంటలను తగులబెట్టారు.

గంజాయి సాగు వల్ల కలిగే నష్టాలు, కేసుల గురించి అక్కడి గిరిజనులకు, సాగు దారులకు పోలీసులు వివరించారు. రాష్ట్రంలో అత్యధికంగా గంజాయి రవాణా ఒక్క తూర్పుగోదావరి జిల్లా నుంచి జరుగుతుండటం, ఇతర రాష్ట్రాల్లో పట్టుబడుతున్న కేసుల్లో కూడా జిల్లాకి చెందిన వారు ఉండటంతో మొత్తం మూలాలతో సహా గంజాయిని నిర్వీర్యం చేయాలని పోలీసుశాఖ భావించి ఈ నిర్మూళన చర్యలు చేపట్టింది. మరోవైపు గంజాయి, నాటుసారా వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండటంతో పోలీసులు తమ దూకుడుని పెంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories