ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 175 మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 4న తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఎస్ఈసీ ప్రకటించింది. ఫిబ్రవరి 5న నామినేషన్ల పరిశీలన, ఆరో తేదీన నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన, ఏడవ తేదీన అభ్యంతరాలపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 8లోగా నామినేష్లు ఉపసంహరించుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 13న పోలింగ్.. అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు., ఫలితాల వెల్లడి ఉంటుందని ఎన్నికలసంఘం ప్రకటించింది.
రెండో దశ ఎన్నికలు జరిగే మండలాలివే
శ్రీకాకుళం
మండలాలు: ఎల్.ఎన్.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి
విశాఖపట్నం
మండలాలు: అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి, బుచ్చియ్యపేట, చోడవరం
తూర్పుగోదావరి
మండలాలు: గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు, యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం, తొండంగి, తుని, ఏలేశ్వరం
పశ్చిమగోదావరి
రెవెన్యూ డివిజన్: నర్సాపురం
మండలాలు: ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు, నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలి
కృష్ణా
మండలాలు: చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం,జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరుళ్లపాడు, విజయవాడ
గుంటూరు
మండలాలు: అమర్తలూరు, బాపట్ల, బట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కాకుమాను, కర్లపాలెం, కొల్లిపరం, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు
ప్రకాశం
మండలాలు: అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్.మాగులూరు, ఎస్.ఎన్.పాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి
నెల్లూరు
మండలాలు: అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వరికుంటపాడు
కర్నూలు
మండలాలు: ఆళ్లగడ్డ, చాగలమర్రి, దోర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యావాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు
అనంతపురం
మండలాలు: ఆమడగూర్, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్.పి కుంట, నల్లచెరువు, నల్లమడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి, తలుపుల, తనకల్
కడప
మండలాలు: చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు, అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్.ఎ.కె. ఎన్, కలసపాడు, బి.మఠం
చిత్తూరు
మండలాలు: బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, ఆర్.సి.పురం, ఎస్.ఆర్ పురం, తవనంపల్లి, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యడమారి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire