బాధ్యతల స్వీకరణకు ముహూర్తాలు చూసుకుంటున్న మంత్రులు.. పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణపై సర్వత్రా ఉత్కంఠ

AP New Ministers Look for Muhurtham to Assume Charge
x

బాధ్యతల స్వీకరణకు ముహూర్తాలు చూసుకుంటున్న మంత్రులు.. పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణపై సర్వత్రా ఉత్కంఠ

Highlights

AP New Ministers: ఏపీ కేబినెట్ కూర్పు పూర్తైంది. వారి సామర్థ్యం దృష్టిలోపెట్టుకుని సీఎం చంద్రబాబు.. ప్రమాణస్వీకారం చేసిన పలువురు మంత్రులకు శాఖలు కేటాయించారు.

AP New Ministers: ఏపీ కేబినెట్ కూర్పు పూర్తైంది. వారి సామర్థ్యం దృష్టిలోపెట్టుకుని సీఎం చంద్రబాబు.. ప్రమాణస్వీకారం చేసిన పలువురు మంత్రులకు శాఖలు కేటాయించారు. బాధ్యతలు స్వీకరించడానికి మంత్రులు ముహూర్తాల వేటలో పడినట్టు తెలుస్తుంది. ఇక అందరి చూపు పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణపై ఉంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీశాఖలను పవన్‌కు కేటాయించారు. ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటారోనని ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

మరోవైపు శాఖలు కేటాయించిన వెంటనే సీఎం చంద్రబాబును కలిసిన పలువురు మంత్రులకు సూచనలు సలహాలు చేశారు. పదవులు కేటాయించగానే.. కాదు.. బాధ్యతగా ఉండాలన్నారు. మంత్రులు ఎక్కువ సమయం సచివాలయంలో గడపాలని మీ శాఖలో ఏమి జరుగుతుందో బాధ్యతగా పర్యవేక్షించాలని సూచించారు. మంత్రులుగా పదవులు పొందటం కాదు వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకువెళ్లాలంటే విశ్రాంతి లేకుండా అందరూ పనిచేయాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories