Live Updates: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

AP Municipal Elections 2021 : ఏపీలోని పుర, నగర పాలక పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మొత్తం 2,214 డివిజన్లు/వార్డుల్లో కలిపి 77,73,231 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Show Full Article

Live Updates

  • 10 March 2021 5:52 AM GMT

    AP Municipal Elections 2021: కడప జిల్లా బద్వేల్‌లోని 16వ వార్డులో ఘర్షణ

    కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 16వ వార్డులో పోలింగ్ బూత్‌ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణులు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి పలువురిని అదుపులోకి తీసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

  • 10 March 2021 5:44 AM GMT

    AP Municipal Elections 2021: కడప జిల్లా బద్వేల్‌లోని 16వ వార్డులో ఘర్షణ

    కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 16వ వార్డులో పోలింగ్ బూత్‌ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణులు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి పలువురిని అదుపులోకి తీసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

  • 10 March 2021 5:42 AM GMT

    AP Municipal Elections 2021: అనంతపురం జిల్లా కదిరి పట్టణం 29వ వార్డులో ఉద్రిక్తత

    అనంతపురం జిల్లా కదిరి పట్టణం 29వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు టీడీపీ నేత వెంకటప్రసాద్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎమ్మెల్యే సిద్దారెడ్డి, వైసీపీ నేతలు తిరుగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల తీరును నిరసిస్తూ వెంకటప్రసాద్ పోలింగ్‌ కేంద్రం వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. 

  • 10 March 2021 5:28 AM GMT

    AP Municipal Elections 2021: తిరుపతి 15వ డివిజన్‌లో టెన్షన్‌.. టెన్షన్‌

    తిరుపతి 15వ డివిజన్‌లో ఉద్రిక్తత నెలకొంది. బైరాగి పట్టెడ పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు గుమ్మగూడటంతో పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. మాట మాట పెరగడంతో పరిస్థితి అదుపుతప్పి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి పరిస్థితి అదుపు చేశారు. పోలీసులు భారీగా మోహరించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

  • 10 March 2021 5:14 AM GMT

    AP Municipal Elections 2021: సంతృప్తికరంగా భద్రతా ఏర్పాట్లు: ఎస్‌ఈసీ

    ఎస్ఈసీ నిమ్మగడ్డ, కలెక్టర్లతో కలిసి పోలింగ్ స్టేషన్లు పరిశీలించారు. విజయవాడలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని వాలంటీర్లు వారి ఫోన్లు లేకుండా నిబంధనలను అనుసరిస్తున్నారని చెప్పారు. అధికారులు పోలింగ్ కు చేసిన ఏర్పాట్లపై ఎస్ఈసీ హర్షం వ్యక్తం చేశారు. పోలింగ్ ఏజెంట్లు సుహృద్భావ వాతావరణంలో పనిచేస్తున్నారని తెలిపారు. ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నానన్నారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువగా చూస్తామని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్‌ఈసీ పిలుపునిచ్చారు.



     


  • 10 March 2021 5:06 AM GMT

    AP Municipal Elections 2021: ఉదయం 9గంటల వరకు పోలింగ్‌ శాతం వివరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళంలో 10, విజయనగరంలో 14, విశాఖ 14, తూర్పుగోదావరి జిల్లాలో 16, పశ్చిమగోదావరిలో 16, కృష్ణాలో 13, గుంటరులో 16, ప్రకాశం జిల్లాలో 14, నెల్లూరులో 12, చిత్తూరులో 9, అనంతపురంలో 12, కడపలో 8, కర్నూలు జిల్లాలో 11 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.

  • 10 March 2021 4:35 AM GMT

    AP Municipal Elections 2021: పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతన్న పోలింగ్‌

    పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.   

  • 10 March 2021 4:15 AM GMT

    AP Municipal Elections 2021: ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి

    విశాఖ 14వ వార్డులో ఎంపీ విజయసాయిరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మారుతీనగర్ పోలింగ్ బూత్ నెంబర్ 11లో సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు. జీవిఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. గతంలో గ్రేటర్ విశాఖలో 50 శాతానికి మించి పోలీంగ్ నమోదు కాలేదన్నారు. అయితే ఇప్పుడు అంతకుమించి పోలింగ్ శాతం పెరగాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకుని మంచి పాలన అందించే కార్పొరేటర్‌ని ఎన్నుకోవాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.



     


  • 10 March 2021 4:12 AM GMT

    AP Municipal Elections 2021: విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్‌

    విజయనగరం జిల్లాలో మున్సిల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు వినియోగంతో సమాజంలో హక్కు, బాధ్యత పెరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అశోక్‌ గజపతిరాజు కోరారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

  • 10 March 2021 4:04 AM GMT

    AP Municipal Elections 2021: ఓటు హక్కును వినియోగించుకున్న పవన్‌ కల్యాణ్‌

    విజయవాడ పటమటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. 9వ వార్డులోని 4వ పోలింగ్‌ స్టేషన్‌లో ఆయన ఓటు వేశారు. స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్‌కల్యాణ్‌తోపాటు బూత్‌లోపలికి వెళ్లేందుకు అభిమానులు యత్నించగా పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసి చెదరగొట్టారు.



     


Print Article
Next Story
More Stories