AP New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్‌.. కొత్త పెన్షన్ దరఖాస్తులకు ఆహ్వానం..!

AP Ministers Key Announcement About New NTR Bharosa Pension Applications
x

AP New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్‌.. కొత్త పెన్షన్ దరఖాస్తులకు ఆహ్వానం..!

Highlights

AP New Pensions: ఆంధ్రప్రదేశంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌ పథకాల అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

AP New Pensions: ఆంధ్రప్రదేశంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌ పథకాల అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పెన్షన్‌ పెంపుతో పాటు, ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలను అమలు చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే పెన్షన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

పెన్షన్‌ పథకం పేరును ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌గా మార్చుతూ పెన్షన్‌ను రూ. 4వేలకు పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 64,14,174 మందికి పెన్షన్‌ లభిస్తోంది. ఇదిలా ఉంటే కొత్త పెన్షన్‌ల దరఖాస్తులు ఎప్పుడుంటాయన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తుందన్న దాని కోసం ఆతృతగా చూస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. త్వరలోనే కొత్త పెన్షన్‌ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

రాష్ట్రంలో అర్హులైన పెన్షన్‌దారులకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ.. పెన్షన్‌ దారులు గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా వచ్చే నెలలో పెన్షన్‌ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని అధికారులకు సూచించారు. నకిలీ ధృవపత్రాలతో ఎవరైనా అనర్హులు పెన్షన్‌ తీసుకుంటునట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇక కొత్త పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారు డిసెంబర్‌ 1వ తేదీ తర్వాత గ్రామ లేదా వార్డ్ సచివాలయానికి వెళ్లి, పెన్షన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి విదివిధానాలను ప్రభుత్వం మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories