AP Minister Alla Nani: అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి: ఏపీ మంత్రి ఆళ్ల నాని ఆదేశం

AP Minister Alla Nani: అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి: ఏపీ మంత్రి ఆళ్ల నాని ఆదేశం
x

AP Minister Alla   nani

Highlights

AP Minister Alla Nani: ఏలూరు నగరంలో 15వ ఆర్ధిక సంఘo ద్వారా మంజూరు అయిన5కోట్ల 50లక్షలు రూపాయలతో ప్రజలకు ప్రాధాన్యతతో కూడిన అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రతి పాదనలు సిద్ధం చేయాలని ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు.

AP Minister Alla Nani: ఏలూరు నగరంలో 15వ ఆర్ధిక సంఘo ద్వారా మంజూరు అయిన5కోట్ల 50లక్షలు రూపాయలతో ప్రజలకు ప్రాధాన్యతతో కూడిన అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రతి పాదనలు సిద్ధం చేయాలని ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు...సెంటర్ లైటింగ్, పార్కులు, స్మశాన వాటికలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఏలూరు నగర ప్రజలకు ఆహ్లాదం కలిగించే విధంగా అత్యంత ఆకర్షణీయంగా పార్కును సిద్ధం చేయాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు.. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏలూరు కార్పొరేషన్ అధికారులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతి పై సమీక్షించారు...

ఈ సందర్బంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ ఏలూరు లో 54మునిసిపల్ పాఠశాలలోకనీస సౌకర్యాలు, అదనపు తరగతి గదులు నిర్మాణానికి మరో 8కోట్లు రూపాయలు మంజూరు అయ్యాయని త్వరలో పనులు చేయడానికి ప్రతి పాదననలు రూపొందించి తీసుకురావాలని మంత్రి ఆళ్ల నాని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు.. ఏలూరు నగరంలో రోడ్స్ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెడల్పు గా సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసే విధంగా ప్రతి పాదనలు సిద్ధం చేయాలని, హిందూ, క్రిస్టియన్, ముస్లిం స్మశాన వాటికలకు సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని, బిర్లా భవన్ నుండి ymha వరకు సెంటర్ లైటింగ్ ఏర్పాటుకు కూడ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని కోరారు... ఏలూరు లో ప్రజలకు ఆహ్లాద వాతావరణం కలిగించే విధంగా కోటి రూపాయలు అంచనాతో ఒక పార్కు ను సిద్ధం చేయాలని.. ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించే దిశగా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు....

అన్ని పార్కు లు ఆధునీకరించాలని అదే విధంగా వాకింగ్ ట్రాక్ కూడ ఏర్పాటు చేయాలని...నగరంలో ఉన్న ప్రధాన పార్కులు గుర్తించి మోడల్ గా తీర్చి దిద్దాలని, ఇతర ప్రాంతాల నుండి ఏలూరు నగరానికి వచ్చే ప్రజలకు పార్కులు ఆహ్లాదం కలిగించే రీతిలో సిద్ధం చేయాలని మంత్రి ఆళ్ల నాని కార్పొరేషన్ కమీషనర్ చంద్రశేఖర్ ను ఆదేశించారు...

త్వరలో నగరంలో అభివృద్ధి పనులు స్వయంగా పరిశీలిస్తానని నాణ్యత లోపించకుండ అభివృద్ధి పనులు జరగడానికి అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు.. ఈ సమావేశంలో ఏలూరు మునిసిపల్ కమీషనర్ డి చంద్రశేఖర్, పిఓ హరిబాబు, డిఈ లు కొండలరావు, సత్యనారాయణ, పలువురు ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.....

మట్టిని తరలించేందుకు చర్యలు తీసుకోండి.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణి లో భాగంగా స్థలం చదును చేయడానికి ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మట్టిని తరలించడం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ సర్కిల్ పరిధిలో ఉన్న మట్టిని క్యూబిక్ మీటర్ 86రూపాయలు చొప్పున మట్టిని తరలించడం కోసం ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు... ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు... ఈ సందర్బంగా గుంటూరు జిల్లా సత్తనెపల్లి లో EE గా బాధ్యతలు నిర్వహిస్తున్న బి శ్యామ్ ప్రసాద్ ను ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ సర్కిల్ కు పూర్తి అదనపు బాధ్యతలతో నియమించింది..

శ్రీ శ్యామ్ ప్రసాద్ మర్యాద పూర్వకంగా ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిని కలిసి పుష్పగుచ్ఛము అందచేసారు. అనంతరం జరిగిన సమీక్షలో మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాలు చదును చేయడానికి జిల్లా యంత్రాంగం క్యూబిక్ మీటర్ మట్టిని 86రూపాయలకు కేటాయించాలని ఇచ్చిన ఆదేశాలు పాటించక పోవడం పై మంత్రి ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు... అన్ని టాక్స్ లతో కలిపి 135రూపాయలు వసూలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ఇంజినీరింగ్ అధికారులను మంత్రి ప్రశ్నించారు.. వెంటనే మంత్రి ఆళ్ల నాని ఏపి ఇరిగేషన్ సెక్రటరీ ఆదిత్య నాధ్ తో ఫోన్లో మాట్లాడి క్యూబిక్ మీటర్ 86రూపాయలకే GST కాకుండా మట్టి సరఫరా కు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని కోరారు...

పేదలకు ఇచ్చే స్థలాల్లో ఇంజినీరింగ్ అధికారులు నిర్లక్ష్యం లేకుండా త్వరగా మట్టిని తరలించడం కోసం చర్యలు తీసుకోవాలని, కొత్తగా ఇస్తున్న స్థలాల్లో కనీస వసతులు కల్పించవలసిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి ఆళ్ల నాని చేప్పారు... ఈ సమావేశంలో ఇంచార్జి SE బి శ్యామ్ ప్రసాద్, EE గురు ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంటింగ్ ఇంజినీర్ రాజు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ల పల్లి జయప్రకాశ్, ఏపి మెడికల్ కౌన్సిల్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ దిరి శాల వర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు...

Show Full Article
Print Article
Next Story
More Stories