Tirupati: స్పెషల్ కోర్టు ద్వారా 3 నెలల్లో నిందితుడికి కఠిన శిక్ష: హోంమంత్రి అనిత

Tirupati: స్పెషల్ కోర్టు ద్వారా 3 నెలల్లో నిందితుడికి కఠిన శిక్ష: హోంమంత్రి అనిత
x
Highlights

AP Home Minister Vangalapudi Anitha: తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో హత్యాచారానికి గురైన మూడేళ్ల చిన్నారి కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ. 10 లక్షల...

AP Home Minister Vangalapudi Anitha: తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో హత్యాచారానికి గురైన మూడేళ్ల చిన్నారి కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆ చిన్నారి ఇంటికి వెళ్లి బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి అనిత పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించారు.

చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. చిన్నారి మృతికి కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ప్రత్యేక కోర్టు ద్వారా 3 నెలల వ్యవధిలోనే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. అలానే బాధిత కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అనిత తెలిపారు. ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడం సరికాదని మంత్రి అనిత ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories