Vangalapudi Anitha: ముచ్చుమర్రి బాధిత బాలిక కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం

AP Home Minister Vangalapudi Anitha Press Meet
x

Vangalapudi Anitha: ముచ్చుమర్రి బాధిత బాలిక కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం

Highlights

Vangalapudi Anitha: స్పెషల్ కోర్టుల ద్వారా శిక్ష పడేలా చూడాలని సీఎం ఆదేశించారు

Vangalapudi Anitha: అడపిల్లల్ని తప్పుగా చూసే వారికి భయం కలిగేలా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. వారు ఏ పార్టీ వాళ్ళైన వదిలిపెట్టబోమన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరం ఘటనలు అత్యంత దారుణమని హోం మంత్రి వ్యాఖ్యానించారు. ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం ఇంకా లభించలేదన్నారు. సీఎం చంద్రబాబు వీటిపై సమీక్షించారని, గంజాయి, లిక్కర్ మీద ఉక్కుపాదం మోపాలని సీఎం చెప్పారన్నారు. ఈ ఘటనలను స్పెషల్ కోర్టు ద్వారా విచారించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ముచ్చుమర్రి బాధిత కుటుంబానికి 10 లక్షలు, 6 నెలల చిన్నారి కుటుంబానికి 5లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హోం మంత్రి అనిత తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories