AP high Court: ధూళిపాళ్ల కస్టడీ ఆదేశాలను నిలిపివేసిన హైకోర్టు

AP high Court Suspended the Dulipalla Narendra Police Custody Orders
x

దూళిపాళ్ల నరేంద్ర (ఫైల్ ఇమేజ్)

Highlights

AP high Court: మాజీ ఎమ్మెల్యే, టీడీపీనేత ధూళిపాళ్ల నరేంద్ర ఐదు రోజుల ఏసీబీ కస్టడీ ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది.

AP high Court: మాజీ ఎమ్మెల్యే, టీడీపీనేత ధూళిపాళ్ల నరేంద్ర ఐదు రోజుల ఏసీబీ కస్టడీ ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది. వివరాల్లోకి వెళితే సగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, సహకారశాఖ మాజీ అధికారి గురునాథం అరెస్ట్ చేశారు. వారిని ఐదు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతినిస్తూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల అమలును ఏపీ హైకోర్టు నిలిపేసింది. అలాగే, వారిని రాజమహేంద్రవరం సెంట్ర‌ల్ జైలుకి తరలించాలని చెప్పింది. ఈ కేసులో త‌దుప‌రి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కాగా, నిన్న వారి ముగ్గురిని జైలు నుంచి విజయవాడకు తరలించి ఏసీబీ కార్యాలయంలో విచారించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నరేంద్ర భార్య‌ జ్యోతిర్మయి మాట్లాడుతూ.. త‌న భర్తను అక్రమంగా కేసులో ఇరికించేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోప‌ణ‌లు చేశారు. ఏ అంశంపై కేసు నమోదు చేశారో కూడా స్పష్టత లేదని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories